బన్నీ సినిమాకు ముహూర్తం సెట్టయింది
బోయపాటి శ్రీను, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు ముహూర్తం సెట్ అయింది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమాను జులై 19న ప్రారంభించాలని నిర్ణయించారు. ఆ రోజు ముహూర్తం షాట్ తో పాటు రెగ్యులర్ షూటింగ్ కూడా ఉంటుంది. ఈ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు ప్రాధమికంగా రథం అనే టైటిల్ అనుకుంటున్నారు. సినిమా లాంఛింగ్ రోజు టైటిల్ ను ప్రకటించే అవకాశముంది. చాలా రోజుల గ్యాప్ తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్ […]
BY admin30 Jun 2015 12:30 AM IST
X
admin Updated On: 30 Jun 2015 5:50 AM IST
బోయపాటి శ్రీను, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు ముహూర్తం సెట్ అయింది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమాను జులై 19న ప్రారంభించాలని నిర్ణయించారు. ఆ రోజు ముహూర్తం షాట్ తో పాటు రెగ్యులర్ షూటింగ్ కూడా ఉంటుంది. ఈ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు ప్రాధమికంగా రథం అనే టైటిల్ అనుకుంటున్నారు. సినిమా లాంఛింగ్ రోజు టైటిల్ ను ప్రకటించే అవకాశముంది. చాలా రోజుల గ్యాప్ తర్వాత గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించబోతోంది. నిజానికి బోయపాటి-బన్నీ సినిమా ఈ పాటికి సెట్స్ పైకి రావాల్సింది. కానీ స్క్రీన్ ప్లేలో కొన్ని మార్పులు చేయాల్సిందిగా బన్నీ సూచించడంతో.. ప్రీప్రొడక్షన్ వర్క్ కు ఇంత టైం పట్టింది. మరోవైపు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కాల్షీట్లు ఎడ్జస్ట్ కావడానికి కూడా టైం పట్టడంతో సినిమా సెట్స్ పైకి రావడానికి కాస్త ఆలస్యమైంది. ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకుడు.
Next Story