పనికి రాడు అన్నవాడే దిక్కయ్యాడు!
నవ్విన నాప చేను పండటమంటే ఇదే.. ఆటతీరు సరిగాలేదని అజింక్యా రహానేను జట్టులోకి తీసుకోలేదని కెప్టెన్ ధోనీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే! అకస్మాత్తుగా ఇప్పుడు అతనే భారత అంతర్జాతీయ క్రికెట్ జట్టుకు కెప్టెన్ అయ్యాడు. ఏకంగా ధోనీ స్థానాన్ని భర్తీ చేసేశాడు. భారత జట్టు సారిథిగా జింబాబ్వే పర్యటనకు నేతృత్వం వహించనున్నాడు. ఎందుకూ పనికిరాడు అన్న వారే ఒక్కసారిగా పైకి రావడాన్నిచూస్తుంటాం.. అజింక్య రహానే విషయంలోనూ సరిగ్గా ఇలాగే జరిగింది. అతని కంటే సీనియర్ అయిన.. […]
నవ్విన నాప చేను పండటమంటే ఇదే.. ఆటతీరు సరిగాలేదని అజింక్యా రహానేను జట్టులోకి తీసుకోలేదని కెప్టెన్ ధోనీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే! అకస్మాత్తుగా ఇప్పుడు అతనే భారత అంతర్జాతీయ క్రికెట్ జట్టుకు కెప్టెన్ అయ్యాడు. ఏకంగా ధోనీ స్థానాన్ని భర్తీ చేసేశాడు. భారత జట్టు సారిథిగా జింబాబ్వే పర్యటనకు నేతృత్వం వహించనున్నాడు. ఎందుకూ పనికిరాడు అన్న వారే ఒక్కసారిగా పైకి రావడాన్నిచూస్తుంటాం.. అజింక్య రహానే విషయంలోనూ సరిగ్గా ఇలాగే జరిగింది. అతని కంటే సీనియర్ అయిన.. రోహిత్‌శర్మను పక్కనబెట్టి రహానానే ఎంపిక చేయడంపై సీనియర్లు విస్మయం వ్యక్తంచేసినా.. రహానే అందుకు తగ్గవాడే కావడంతో అందరూ బోర్డు నిర్ణయాన్ని స్వాగతించారు. ఇందులో మరోకోణం కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. ధోనీ, కోహ్లీల మధ్య మాటల యుద్ధం జరిగిన నేపథ్యంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని ఒకసారి పరిశీలించాల్సి ఉంది. ధోనీ పనికిరాడు అన్నవాడినే తీసుకొచ్చి కెప్టెన్ను చేసింది బీసీసీఐ. అంటే అతని నిర్ణయమూ ఫైనల్ కాదని, అంతిమ తీర్పు తమదేనని సంకేతాలు పంపినట్లుందని పలువురు క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.