Telugu Global
Others

'ఎర్ర' ఎఫెక్ట్... 40 మంది ఆర్టీసీ డ్రైవర్లకు ఉద్వాస‌న‌

ఎర్ర చంద‌నం స్మ‌గ్ల‌ర్ల‌ పాపం వారి పాలిట శాపం అయింది. పై డ‌బ్బులు వ‌స్తే దారి ఖ‌ర్చులు పోతాయ‌ని ఆశపడి అడ్డ‌దారి తొక్కిన ఉద్యోగులు ఏకంగా జీవనోపాధిని కోల్పోయారు. ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరించిన 40 మంది ఆర్టీటీ డ్రైవర్లను తొలగిస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. ఎర్ర చందనం చిన్న దుంగ కూడా ల‌క్ష‌ల రూపాయ‌లు ప‌లుకుతుంది. దీంతో స్మ‌గ్ల‌ర్లు చిన్న దుంగ‌కు వందో రెండొంద‌లో ఇచ్చి ఆర్టీసీ […]

ఎర్ర చంద‌నం స్మ‌గ్ల‌ర్ల‌ పాపం వారి పాలిట శాపం అయింది. పై డ‌బ్బులు వ‌స్తే దారి ఖ‌ర్చులు పోతాయ‌ని ఆశపడి అడ్డ‌దారి తొక్కిన ఉద్యోగులు ఏకంగా జీవనోపాధిని కోల్పోయారు. ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరించిన 40 మంది ఆర్టీటీ డ్రైవర్లను తొలగిస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆ కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. ఎర్ర చందనం చిన్న దుంగ కూడా ల‌క్ష‌ల రూపాయ‌లు ప‌లుకుతుంది. దీంతో స్మ‌గ్ల‌ర్లు చిన్న దుంగ‌కు వందో రెండొంద‌లో ఇచ్చి ఆర్టీసీ బ‌స్సుల్లో వాటిని త‌ర‌లించేవారు. దీనికి అల‌వాటు ప‌డ్డ ఆర్టీసీ డ్రైవ‌ర్లు అల‌వోక‌గా ఈ ప‌ని చేసేసేవారు. స్మగ్లర్లు అనతికాలంలోనే కోటీశ్వరులు అయితే.. కూలీలు లక్షాధికారులు అయ్యారు. అయితే ఆ కూలీలను బస్సుల్లో ఎక్కించుకుని అడిగిన చోట దించిన ఆర్టీసీ డ్రైవర్లు మాత్రం తాత్కాలికంగా అప్ప‌ట్లో ప్ర‌యోజ‌నం పొందినా ఇపుడు రోడ్డున పడ్డారు. ఎర్రదొంగలకు సహకరించినందుకు న‌లభై మంది డ్రైవ‌ర్ల‌కు ఉద్యోగాలు పోయాయి.
First Published:  29 Jun 2015 6:35 PM IST
Next Story