మాస్టారిపై కేసు పెట్టిన విద్యార్థి!
విద్యార్థి కేసు పెట్టడమేమిటి…. అదీ ఓ మాస్టారిపైనా..? హవ్వ ఏం కలికాలమండీ.. ఈకాలంలో గురువంటే అస్సలు పిల్లలకు గౌరవం లేకుండా పోయింది.. ఈ వార్త చదవగానే ఇలాంటి వ్యాఖ్యానాలు మామూలే.. ఇంతకీ అసలేం జరిగిందంటే.. ఓ కార్పొరేట్ కాలేజీలో చదువుతున్న ఇంటర్మీడియేట్ విద్యార్థి….. తనను కొట్టాడంటూ మాస్టారిపై కేసు పెట్టాడు. ఈమేరకు హైదరాబాద్ శివార్లలోని మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. నారాయణ గ్రూప్‌కి చెందిన మదీనాగూడ జూనియర్ రెసిడెన్షియల్ క్యాంపస్‌లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఇంటర్నర్ […]
BY Pragnadhar Reddy29 Jun 2015 4:58 AM IST
Pragnadhar Reddy Updated On: 29 Jun 2015 5:43 AM IST
విద్యార్థి కేసు పెట్టడమేమిటి…. అదీ ఓ మాస్టారిపైనా..? హవ్వ ఏం కలికాలమండీ.. ఈకాలంలో గురువంటే అస్సలు పిల్లలకు గౌరవం లేకుండా పోయింది.. ఈ వార్త చదవగానే ఇలాంటి వ్యాఖ్యానాలు మామూలే.. ఇంతకీ అసలేం జరిగిందంటే.. ఓ కార్పొరేట్ కాలేజీలో చదువుతున్న ఇంటర్మీడియేట్ విద్యార్థి….. తనను కొట్టాడంటూ మాస్టారిపై కేసు పెట్టాడు. ఈమేరకు హైదరాబాద్ శివార్లలోని మియాపూర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. నారాయణ గ్రూప్‌కి చెందిన మదీనాగూడ జూనియర్ రెసిడెన్షియల్ క్యాంపస్‌లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఇంటర్నర్ పరీక్షకు పెన్నులేకుండా వచ్చిన విద్యార్థిపై లెక్కల మాస్టారు చేయిచేసుకున్నాడని, దాంతో ఆ విద్యార్థి మాస్టారిపై కేసు పెట్టాడని పోలీసులు చెబుతున్నారు. విద్యార్థి ఫిర్యాదు ఆధారంగా ఐపీసీ సెక్షన్ 324 కింద కేసు నమోదు చేశామని, వైద్యపరీక్షల నిమిత్తం ఆ విద్యార్థిని ఆసుపత్రికి పంపించామని పోలీసులు తెలిపారు.
Next Story