Telugu Global
Others

స్టీఫెన్‌సన్ క్వాష్ పిటిష‌న్ కొట్టివేత: కేసు నమోదుకు ఆదేశం

స్టీఫెన్‌స‌న్‌కు హైకోర్టులో చుక్కెదుర‌య్యింది. ఓటుకు నోటు కేసులో ఏ-4గా ఉన్న మత్తయ్య హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను వేరే బెంచ్‌కు తరలించాలన్న స్టీఫెన్‌సన్‌ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. జెరూసలెం మత్తయ్య క్వాష్‌ పిటిషన్‌పై విచారణ ఇదే బెంచ్‌లో కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది. స్టీఫెన్‌సన్‌ తప్పుడు అఫిడవిట్‌ ఇచ్చి కోర్టును తప్పుదోవ పట్టించారంటూ న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక న్యాయ‌మూర్తిపై అనుమానాలు దేని ఆధారంగా వ్య‌క్తం చేస్తార‌ని ప్ర‌శ్నించింది. న్యాయ‌మూర్తుల‌కు, న్యాయ‌స్థానానికి దురుద్దేశాల‌ను ఎలా […]

స్టీఫెన్‌సన్ క్వాష్ పిటిష‌న్ కొట్టివేత: కేసు నమోదుకు ఆదేశం
X
స్టీఫెన్‌స‌న్‌కు హైకోర్టులో చుక్కెదుర‌య్యింది. ఓటుకు నోటు కేసులో ఏ-4గా ఉన్న మత్తయ్య హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను వేరే బెంచ్‌కు తరలించాలన్న స్టీఫెన్‌సన్‌ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. జెరూసలెం మత్తయ్య క్వాష్‌ పిటిషన్‌పై విచారణ ఇదే బెంచ్‌లో కొనసాగుతుందని కోర్టు స్పష్టం చేసింది. స్టీఫెన్‌సన్‌ తప్పుడు అఫిడవిట్‌ ఇచ్చి కోర్టును తప్పుదోవ పట్టించారంటూ న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక న్యాయ‌మూర్తిపై అనుమానాలు దేని ఆధారంగా వ్య‌క్తం చేస్తార‌ని ప్ర‌శ్నించింది. న్యాయ‌మూర్తుల‌కు, న్యాయ‌స్థానానికి దురుద్దేశాల‌ను ఎలా అంట‌గ‌డ‌తార‌ని ఆగ్ర‌హిస్తూ స్టీఫెన్‌స‌న్‌పై కోర్టు ధిక్క‌ర‌ణ కేసు న‌మోదు చేయాల‌ని హైకోర్టు రిజిస్ట్రార్‌కు న్యాయ‌మూర్తి ఆదేశించారు. ఈ ఆదేశాల‌పై ఎలాంటి అభ్యంత‌రాలున్నా హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి వ‌ద్ద అప్పీలు చేసుకోవ్చ‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది.
అయితే ఈ కేసును వాదిస్తున్న డిఫెన్స్ న్యాయ‌వాది మాట్లాడుతూ మ‌త్త‌య్య కేసులో ఇంకా స్టీఫెన్‌స‌న్‌కు అభ్యంత‌రాలుండి ప్ర‌స్తుత న్యాయ‌మూర్తి ఇచ్చిన తీర్పుపై అప్పీలు చేసుకోదలిస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళ‌వ‌ల‌సి ఉంటుంద‌ని, ఇక ఈ కోర్టు ప‌రిధిలో తిరిగి అప్పీలు చేసుకునే అవ‌కాశం లేద‌ని అన్నారు. కౌన్సిల్ న్యాయ‌వాది మాట్లాడుతూ ఈ కోర్టులోనే మ‌రో బెంచ్‌లో అప్పీలు చేసుకోవ‌చ్చని అన్నారు. న్యాయ‌మూర్తి మీద ఏవ‌రైనా అనుమానాలు వ్య‌క్తం చేసిన‌ప్పుడు హుందాగా ఆ న్యాయ‌మూర్తి త‌ప్పుకున్న సంద‌ర్భాలున్నాయని, కాని ప్ర‌స్తుత తీర్పు ఇచ్చిన న్యాయ‌మూర్తి అలా వ్య‌వ‌హ‌రించ‌క‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని వ్యాఖ్యానించారు.
First Published:  29 Jun 2015 6:24 AM IST
Next Story