Telugu Global
NEWS

రంగారెడ్డికి రాజ‌న్న బిడ్డ

దివంగ‌త ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి కుమార్తె ష‌ర్మిల సోమ‌వారం నుంచి నాలుగు రోజుల పాటు రంగారెడ్డి జిల్లాలో ప‌ర్య‌టించనున్నారు. వైఎస్ హ‌ఠాన్మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక మ‌ర‌ణించిన  15 మంది  కుటుంబాల‌ను ఆమె ప‌రామ‌ర్శిస్తారు. మ‌హేశ్వ‌రం నియోజ‌క వ‌ర్గం నుంచి ప్రారంభ‌మ‌య్యే ష‌ర్మిల ప‌రామ‌ర్శ‌ యాత్ర మొత్తం 590 కిలోమీట‌ర్ల మేర సాగుతుంంది.  రంగారెడ్డి జిల్లా వైఎస్సార్ పార్టీ అధ్య‌క్షుడు సురేష్‌రెడ్డి  ఆధ్వ‌ర్యంలో ష‌ర్మిల యాత్రకు  ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ యాత్రలో ష‌ర్మిల‌తో పాటు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు […]

రంగారెడ్డికి రాజ‌న్న బిడ్డ
X

దివంగ‌త ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి కుమార్తె ష‌ర్మిల సోమ‌వారం నుంచి నాలుగు రోజుల పాటు రంగారెడ్డి జిల్లాలో ప‌ర్య‌టించనున్నారు. వైఎస్ హ‌ఠాన్మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక మ‌ర‌ణించిన 15 మంది కుటుంబాల‌ను ఆమె ప‌రామ‌ర్శిస్తారు. మ‌హేశ్వ‌రం నియోజ‌క వ‌ర్గం నుంచి ప్రారంభ‌మ‌య్యే ష‌ర్మిల ప‌రామ‌ర్శ‌ యాత్ర మొత్తం 590 కిలోమీట‌ర్ల మేర సాగుతుంంది. రంగారెడ్డి జిల్లా వైఎస్సార్ పార్టీ అధ్య‌క్షుడు సురేష్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో ష‌ర్మిల యాత్రకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ యాత్రలో ష‌ర్మిల‌తో పాటు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొంటారు. రాజ‌న్న బిడ్డ ష‌ర్మిల‌కు ఆత్మీయ స్వాగ‌తం ప‌ల‌కాల‌ని వైఎస్సార్ సీపీ అధికార ప్ర‌తినిధి కొండా రాఘ‌వ‌రెడ్డి రంగారెడ్డి జిల్లా ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

First Published:  29 Jun 2015 7:46 AM IST
Next Story