ముద్దులన్నీ చిన్న రాశిగా పోసింది..!
తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా సక్సెస్ కావడం లేదనుకుంటున్న సమయంలో ఎంట్రీ ఇచ్చి ట్రెడిషనల్ రోల్స్ కు కేరాఫ్ గా నిలిచిన నటి రాశి. కొన్ని గ్లామర్ రోల్స్ చేసి మెప్పించింది. ప్రేయసి రావే వంటి సినిమాలో యాక్టింగ్ తో మెప్పించారు. కెరీర్ కాస్త డౌన్ అవుతున్నప్పుడు శ్రీ అనే బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుని కొంత కాలం సినిమాలకు దూరంగా వున్నారు. అప్పట్లో వూబకాయ సమస్యతో బాధ పడుతుంటడం వల్లే సినిమాలకు దూరంగా వున్నారనే […]
తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా సక్సెస్ కావడం లేదనుకుంటున్న సమయంలో ఎంట్రీ ఇచ్చి ట్రెడిషనల్ రోల్స్ కు కేరాఫ్ గా నిలిచిన నటి రాశి. కొన్ని గ్లామర్ రోల్స్ చేసి మెప్పించింది. ప్రేయసి రావే వంటి సినిమాలో యాక్టింగ్ తో మెప్పించారు. కెరీర్ కాస్త డౌన్ అవుతున్నప్పుడు శ్రీ అనే బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకుని కొంత కాలం సినిమాలకు దూరంగా వున్నారు. అప్పట్లో వూబకాయ సమస్యతో బాధ పడుతుంటడం వల్లే సినిమాలకు దూరంగా వున్నారనే మాట వినిపించింది. అయితే అదేమి కాదు..తను కావాలని తీసుకున్న గ్యాప్ అని రాసి తెలిపారు.ఈ మధ్య ఒక పాపకు జన్మనిచ్చారు. పాపకు రిథిమ అని పేరు పెట్టుకున్నారు. పాప తో సమయమే తెలియడం లేదట.
ఇదిలా వుంటే రాసి సెకండ్ ఇన్నింగ్స్ కు సిద్దం అయ్యారు. ప్రస్తుతం నాగశౌర్య లీడ్ రోల్ లో డైరెక్టర్ నందని రెడ్డి కళ్యాణ వైభోగమే పేరు తో ఒక చిత్రం చేయబోతున్నారు. ఈ చిత్రంలో ఒక కీ రోల్ చేస్తున్నారు. సినిమాలకు సంబంధించి రాసిని ఆమే భర్త ఎంకరేజ్ చేస్తున్నారట. మంచి కథలు వస్తే వదలొద్దని గట్టిగా చెబుతున్నారట. అందుకే హీరోయిన్ రాసి ఇక సెకండ్ ఇన్నింగ్స్ యాక్టింగ్ కు సిద్దం అయ్యారు. రాసి శుభాకాంక్షలు చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రి ఇచ్చారు. ఆ తరువాత ఆమే, గోకులంలో సీత, ప్రేయసి రావే ,పెళ్లి పందిరి చిత్రాలతో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు.