వారందాకా మాటల్లేవ్: పవన్
తెలుగు రాష్ర్టాల్లో నెలకొన్న తాజా పరిణామాలపై వచ్చే వారం తన అభిప్రాయాన్ని వెల్లడిస్తానని జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఓటుకు నోటు, సెక్షన్-8, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై ఈ వారాంతం లేదా వచ్చే వారం మొదట్లో మీడియాతో మాట్లాడనున్నట్లు పవన్ తెలిపారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ప్రశ్నించే నాయకుడు ఎపుడు బయటకు వస్తాడు… ఎపుడు ప్రశ్నిస్తాడని అందరూ ఎదురుచూస్తుంటే ఆయన ట్విట్టర్‌లో ప్రత్యక్షమై ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు సంఖ్యా బలానికే […]
BY sarvi28 Jun 2015 6:46 PM IST
sarvi Updated On: 29 Jun 2015 7:14 AM IST
తెలుగు రాష్ర్టాల్లో నెలకొన్న తాజా పరిణామాలపై వచ్చే వారం తన అభిప్రాయాన్ని వెల్లడిస్తానని జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఓటుకు నోటు, సెక్షన్-8, ఫోన్ ట్యాపింగ్ అంశాలపై ఈ వారాంతం లేదా వచ్చే వారం మొదట్లో మీడియాతో మాట్లాడనున్నట్లు పవన్ తెలిపారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ప్రశ్నించే నాయకుడు ఎపుడు బయటకు వస్తాడు… ఎపుడు ప్రశ్నిస్తాడని అందరూ ఎదురుచూస్తుంటే ఆయన ట్విట్టర్‌లో ప్రత్యక్షమై ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు సంఖ్యా బలానికే అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రజల్ని పట్టించుకోవడం మానేస్తున్నారంటూ రాసుకొచ్చాడు. ఒకప్పుడు నెల్సన్ మండేలా కూడా అలాగే ఆలోచించి ఉంటే, దక్షిణాఫ్రికా పరిస్థితి ఏమయ్యుండేదని ప్రశ్నించాడు పవన్. జనం మేలు కోసమే పని చేసిన నెల్సన్ మండేలా బాటలోనే మన నాయకులు కూడా పయనిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. నెల్సన్ మండెలా గొప్పతనాన్ని చెబుతూ.. తెగేదాకా ఏదీ లాగొద్దనే విషయాన్ని గుర్తుచేశాడు పవన్. అలా కానిపక్షంలో వాళ్లని గద్దెనెక్కించిన జనమే అవస్థలకు గురవాల్సి వస్తుందని పవన్ నిన్నకాక మొన్నటి ట్వీట్స్‌లో వ్యాఖ్యానించాడు. ఇపుడు మళ్ళీ మరోసారి నేరుగా మాట్లాడడానికి వారం రోజులు ఆగాల్సిందేనని గడువు పెట్టాడు.
Next Story