తల్లిదండ్రులు లేని పిల్లలు ఇకపై బీసీలు
తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలను ఇకపై బీసీలుగా గుర్తించి, విద్యా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య హామీ ఇచ్చారు. ప్రభుత్వ, టీటీడీ విద్యాసంస్థల్లో చదువుతున్న అనాథ పిల్లలను బీసీలుగా గుర్తించి ఆదుకుంటామని ఆయన అన్నారు. ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శంచుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కులప్రాతిపదికతో సంబంధం లేకుండా నిజంగా వెనుకబడిన వారు ఎవరనే విషయాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో తిరుపతిలోని పలు చైల్డ్ హోం సంస్థలతో సమావేశమయ్యేందుకు వచ్చానని […]

తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలను ఇకపై బీసీలుగా గుర్తించి, విద్యా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య హామీ ఇచ్చారు. ప్రభుత్వ, టీటీడీ విద్యాసంస్థల్లో చదువుతున్న అనాథ పిల్లలను బీసీలుగా గుర్తించి ఆదుకుంటామని ఆయన అన్నారు. ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శంచుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కులప్రాతిపదికతో సంబంధం లేకుండా నిజంగా వెనుకబడిన వారు ఎవరనే విషయాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో తిరుపతిలోని పలు చైల్డ్ హోం సంస్థలతో సమావేశమయ్యేందుకు వచ్చానని ఆయన తెలిపారు.