చరిత్ర పుస్తకాలను విద్యావేత్తలే రాయాలి
భావి తరాలకు మన వారసత్వ సంపదగా అందించే చరిత్ర పుస్తకాలను నిష్పపక్షపాతంగా పరిశోధనలు జరిపే విద్యావేత్తలు మాత్రమే రాయాలని మాజీ రాష్ట్రపతి ఏపీజె.అబ్దుల్ కలాం అన్నారు. విలువలతో కూడిన విద్య, చక్కటి తల్లిదండ్రుల సంరక్షణ అనేవి బాలలను నేరాల వైపు మళ్లకుండా నిరోధిస్తాయని ఆయన అభిప్రాయ పడ్డారు. ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన చరిత్ర పుస్తకాలను అధికారంలో ఉన్నవారు రాయకూడదని అన్నారు. అందువల్ల భావి తరాలకు నిష్పాక్షిక చరిత్రను అందించలేమని ఆయన అభిప్రాయ పడ్డారు. […]
భావి తరాలకు మన వారసత్వ సంపదగా అందించే చరిత్ర పుస్తకాలను నిష్పపక్షపాతంగా పరిశోధనలు జరిపే విద్యావేత్తలు మాత్రమే రాయాలని మాజీ రాష్ట్రపతి ఏపీజె.అబ్దుల్ కలాం అన్నారు. విలువలతో కూడిన విద్య, చక్కటి తల్లిదండ్రుల సంరక్షణ అనేవి బాలలను నేరాల వైపు మళ్లకుండా నిరోధిస్తాయని ఆయన అభిప్రాయ పడ్డారు. ఢిల్లీలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన చరిత్ర పుస్తకాలను అధికారంలో ఉన్నవారు రాయకూడదని అన్నారు. అందువల్ల భావి తరాలకు నిష్పాక్షిక చరిత్రను అందించలేమని ఆయన అభిప్రాయ పడ్డారు. విస్త్రత పరిశోధనలను నిష్పక్షపాతంగా జరిపే విద్యావేత్తలు మాత్రమే ఆ పని చేయాలని కలాం అన్నారు. సైన్సు, సాంకేతికతకు సంబంధించిన పుస్తకాలను ఎప్పటికప్పుడు తాజా పరిశోధనలు, ఇతరత్రా సమాచారంతో మార్పు చేర్పులు చేయాలని ఆయన సూచించారు.