11 భారతీయ కంపెనీలకు ఫోర్బ్స్ లో స్థానం
ఫోర్బ్స్ ఆసియా తాజాగా ప్రకటించిన బెస్ట్ అండర్ ఎ బిలియన్ కంపెనీల ప్రతష్ఠాత్మక జాబితాలో ఈసారి 11 భారతీయ కంపెనీలకు స్థానం లభించింది. వాటిలో అవంతి ఫీడ్స్, కావేరీ సీడ్స్లు కూడా ఉన్నాయి. ఇంకా బొరోసిల్ గ్లాస్‌వర్క్స్, బైక్ హాస్టిటాలిటీ, కాప్లిన్ పాయింట్ ల్యాబొరేటరీస్, సెంటమ్ ఎలక్ర్టానిక్స్, కైటెక్స్ గార్మెంట్స్, ఎన్‌జిఎల్ ఫైన్-కెమ్, ఆర్బిట్ ఎక్స్‌పోర్ట్స్, ప్రేమ్‌కో గ్లోబల్, వాక్‌రేంజీ ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్నాయి. 2015లో భారతీయ కంపెనీలకు అదృష్టం కలిసివస్తున్నట్టే కనిపిస్తున్నది. చైనా, హాంగ్‌కాంగ్, […]
BY sarvi28 Jun 2015 1:25 PM GMT
sarvi Updated On: 29 Jun 2015 7:18 AM GMT
ఫోర్బ్స్ ఆసియా తాజాగా ప్రకటించిన బెస్ట్ అండర్ ఎ బిలియన్ కంపెనీల ప్రతష్ఠాత్మక జాబితాలో ఈసారి 11 భారతీయ కంపెనీలకు స్థానం లభించింది. వాటిలో అవంతి ఫీడ్స్, కావేరీ సీడ్స్లు కూడా ఉన్నాయి. ఇంకా బొరోసిల్ గ్లాస్‌వర్క్స్, బైక్ హాస్టిటాలిటీ, కాప్లిన్ పాయింట్ ల్యాబొరేటరీస్, సెంటమ్ ఎలక్ర్టానిక్స్, కైటెక్స్ గార్మెంట్స్, ఎన్‌జిఎల్ ఫైన్-కెమ్, ఆర్బిట్ ఎక్స్‌పోర్ట్స్, ప్రేమ్‌కో గ్లోబల్, వాక్‌రేంజీ ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్నాయి. 2015లో భారతీయ కంపెనీలకు అదృష్టం కలిసివస్తున్నట్టే కనిపిస్తున్నది. చైనా, హాంగ్‌కాంగ్, తైవాన్, సౌత్ కొరియాల తర్వాత ఈ జాబితాలో భారతీయ కంపెనీలు నాల్గవ స్థానాన్ని పొందాయి. ఫోర్బ్స్ ఆసియా తమ తాజా ప్రకటనకు ఏటా పది లక్షల డాలర్లకు మించి 100 కోట్ల డాలర్ల లోపు ఆదాయం వస్తున్న కంపెనీలను ప్రాతిపదికగా తీసుకుంది. కనీసం ఒక సంవత్సరం పాటు వ్యాపారంలో ఉన్న కంపెనీలనే ఫోర్బ్స్ ఆసియా తమ పరిశీలనకు ప్రాతిపదికగా తీసుకుంటుంది.
Next Story