చెన్నైలో మెట్రోరైలు ప్రారంభం
చెన్నైలో 45 కిలోమీటర్ల పొడవున నిర్మించిన మెట్రోరైలు మార్గంలో పది కిలోమీటర్లు ఈరోజు నుంచి ప్రయాణీకులకు అందుబాటులోకి వచ్చింది. ముఖ్యమంత్రి జయలలిత మెట్రో రైళ్ళ రాకపోకలను సోమవారం 12:14కి సెక్రటేరియట్ నుండి విడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. సుమారు 14,600 కోట్ల రూపాయల వ్యయంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు పూర్తికావడానికి ఆరు సంవత్సరాలు పట్టింది. అలందూర్-కోయంబేడు స్టేషన్ల మధ్య ప్రస్తుతం ఈ మెట్రోరైలు నడుస్తుంది.