Telugu Global
Others

ధ‌ర‌ల‌కు క‌ళ్ళెంపై కేంద్రం యోచ‌న‌

దేశవ్యాప్తంగా రోజురోజుకూ పెరిగిపోతున్న ఉల్లి, ప‌ప్పుల ధ‌ర‌ల‌కు దిగుమతులతో కళ్లెం వేయాలని కేంద్రం యోచిస్తోంది. కందిపప్పు ధరను నేలకుదించే దిశగా ఇప్పటికే 5 వేల టన్నుల దిగుమతికి టెండర్లు పిలిచింది. తాజాగా ఐదు వేల టన్నుల మినప్పప్పు సరఫరా కోసం కూడా ఎంఎంటీసీ ద్వారా టెండర్లు ఆహ్వానించాలని నిర్ణయించింది. గడచిన ఏడాదిగా మెట్రోనగరాల్లో ఉల్లి చిల్లర ధర 40 శాతానికి పైగా పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో ఉల్లి రూ.24కు విక్రయించగా ఇప్పుడు రూ.34 పలుకుతోందని […]

దేశవ్యాప్తంగా రోజురోజుకూ పెరిగిపోతున్న ఉల్లి, ప‌ప్పుల ధ‌ర‌ల‌కు దిగుమతులతో కళ్లెం వేయాలని కేంద్రం యోచిస్తోంది. కందిపప్పు ధరను నేలకుదించే దిశగా ఇప్పటికే 5 వేల టన్నుల దిగుమతికి టెండర్లు పిలిచింది. తాజాగా ఐదు వేల టన్నుల మినప్పప్పు సరఫరా కోసం కూడా ఎంఎంటీసీ ద్వారా టెండర్లు ఆహ్వానించాలని నిర్ణయించింది. గడచిన ఏడాదిగా మెట్రోనగరాల్లో ఉల్లి చిల్లర ధర 40 శాతానికి పైగా పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో ఉల్లి రూ.24కు విక్రయించగా ఇప్పుడు రూ.34 పలుకుతోందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ శాఖల కార్యదర్శుల కమిటీ గత వారం సమావేశమై ఉల్లితోపాటు పప్పుల ధరలను అదుపు చేయడంపై చర్చించింది. అటుపైన దిగుమతులకుగల సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా వాణిజ్యశాఖకు సిఫారసు చేసింది. ఇదే సమయంలో ఎగుమతులను నిరుత్సాహపరిచే దిశగా టన్నుకు 250 డాలర్లుగా ఉన్న ఉల్లి ఎగుమతి ధరను ప్రభుత్వం 425 డాలర్లకు పెంచింది. ఈ చ‌ర్య ఉల్లి ధ‌ర‌ను అదుపులో ఉంచ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్న‌ది కేంద్రం అంచ‌నా.
First Published:  28 Jun 2015 6:47 PM IST
Next Story