Telugu Global
Others

రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆల్‌బ‌క‌రా పండ్లు

ఆల్‌బ‌క‌రా సీజ‌న్ వ‌చ్చేసింది. మార్కెట్‌లో ఎక్క‌డ చూసినా ఎర్రగా నిగనిగలాడుతుండే ఆల్‌బ‌క‌రా పండ్లు క‌నిపిస్తున్నాయి. వీటిని చూడగానే నోరూరుతుంది.  పులుపు, తీపి క‌ల‌గ‌లిసి ఉండే ఆల్‌బ‌క‌రా పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. సాధారణంగా పండ్లు తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజు స్థాయిలు పెరుగుతుంటాయి. కానీ వీటితో అలాంటి ప్రమాదమేమీ ఉండదు. ఎందుకంటే వీటి ‘గ్త్లసిమిక్‌ ఇండెక్స్‌’ చాలా తక్కువ. వీటిల్లో కేలరీలు కూడా తక్కువే.  ఈ పండ్లలో విటమిన్‌ సి పుష్క‌లంగా ఉంటుంది. అందువల్ల  రోగనిరోధకశక్తి […]

రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆల్‌బ‌క‌రా పండ్లు
X

ఆల్‌బ‌క‌రా సీజ‌న్ వ‌చ్చేసింది. మార్కెట్‌లో ఎక్క‌డ చూసినా ఎర్రగా నిగనిగలాడుతుండే ఆల్‌బ‌క‌రా పండ్లు క‌నిపిస్తున్నాయి. వీటిని చూడగానే నోరూరుతుంది. పులుపు, తీపి క‌ల‌గ‌లిసి ఉండే ఆల్‌బ‌క‌రా పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. సాధారణంగా పండ్లు తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజు స్థాయిలు పెరుగుతుంటాయి. కానీ వీటితో అలాంటి ప్రమాదమేమీ ఉండదు. ఎందుకంటే వీటి ‘గ్త్లసిమిక్‌ ఇండెక్స్‌’ చాలా తక్కువ. వీటిల్లో కేలరీలు కూడా తక్కువే. ఈ పండ్లలో విటమిన్‌ సి పుష్క‌లంగా ఉంటుంది. అందువల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. త్వరగా ఇన్‌ఫెక్షన్ల బారిన పడే ప్ర‌మాదం ఉండ‌దు. ఆల్‌బ‌క‌రా పండ్ల‌లో మెండుగా ఉండే ప్రోసైయానిడిన్‌, నియోక్లోరోజెనిక్‌యాసిడ్‌, క్యూర్‌సెటిన్‌ వంటి ఫెనోలిక్‌ రసాయనాలు శరీరంలో వాపు తగ్గేందుకు తోడ్పడతాయి. కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. ఆల్‌బ‌క‌రా పండ్ల‌లో జీర్ణశక్తిని మెరుగుపరిచే ఫైబర్ ఎక్కువ‌గా ఉంటుంది. విటమిన్‌ ఎ, బీటా కెరోటిన్‌లూ ఇందులో ఉన్నాయి. ఇందులో ఉన్న పొటాషియం గుండెజబ్బులు, రక్తపోటు రాకుండా కాపాడుతుంది. శరీర ఉష్ణోగ్రత సమతుల్యతను కాపాడుతుంది. ఇందులోని విటమిన్‌ కె ఎముకల పటిష్టతను కాపాడటానికి, ఆల్జీమర్స్‌ను నయంచేయడానికి సాయపడుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. ముదురు ఎరుపురంగులో ఉండే ఆల్‌బ‌క‌రా పండ్లలో ఈ ఫెనోలిక్‌ రసాయనాలు మరింత ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ పండ్లనూ వీలైనప్పుడల్లా తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

First Published:  28 Jun 2015 8:01 PM GMT
Next Story