ఒక రాత్రిలో ప్రభాస్ నేర్పించేసాడు.. తమ్మన్న
బాహుబలి సినిమాలో కొన్ని సన్నివేశాల కోసం మిల్కీబ్యూటీ తమన్నా, ప్రభాస్ తో ఓ రాత్రంతా గడిపింది. ఈ విషయాన్ని తనే స్వయంగా ప్రకటించింది కూడా. బాహుబలి మలయాళం వెర్షన్ పాటల విడుదల సందర్భంగా తమన్నా ఈ వివరాల్నీ చెప్పుకొచ్చింది. బాహుబలి సినిమాకు సంబంధించి గుర్రపు స్వారి, విలువిద్య లాంటి నేర్చుకున్నప్పటికీ కత్తియుద్ధం మాత్రం ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదని చెప్పుకొచ్చింది. ప్రభాస్ సహాయంతో ఒక రాత్రిలో కత్తియుద్ధంలో నైపుణ్యం సంపాదించగలిగానని చెప్పుకొచ్చింది. తనకోసం నిద్ర మానుకొని ప్రభాస్ […]
BY admin28 Jun 2015 5:05 AM IST
X
admin Updated On: 28 Jun 2015 5:05 AM IST
బాహుబలి సినిమాలో కొన్ని సన్నివేశాల కోసం మిల్కీబ్యూటీ తమన్నా, ప్రభాస్ తో ఓ రాత్రంతా గడిపింది. ఈ విషయాన్ని తనే స్వయంగా ప్రకటించింది కూడా. బాహుబలి మలయాళం వెర్షన్ పాటల విడుదల సందర్భంగా తమన్నా ఈ వివరాల్నీ చెప్పుకొచ్చింది. బాహుబలి సినిమాకు సంబంధించి గుర్రపు స్వారి, విలువిద్య లాంటి నేర్చుకున్నప్పటికీ కత్తియుద్ధం మాత్రం ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదని చెప్పుకొచ్చింది. ప్రభాస్ సహాయంతో ఒక రాత్రిలో కత్తియుద్ధంలో నైపుణ్యం సంపాదించగలిగానని చెప్పుకొచ్చింది. తనకోసం నిద్ర మానుకొని ప్రభాస్ కత్తియుద్ధం నేర్పించాడని మెచ్చుకుంది. కేవలం తను ప్రభాస్ మాత్రమే కాకుండా.. యూనిట్ లో చాలామంది నటీనటులు ఇలా ప్రాక్టీస్ చేస్తూ నిద్రలే లేని రాత్రులు గడిపామని చెప్పుకొచ్చింది. అంత కష్టపడి తీసిన బాహుబలి సినిమాను అంతా తప్పకుండా ఆదరించాలని కోరుకుంటోంది తమన్న. ప్రస్తుతం బాహుబలికి సంబంధించి తెలుగు,తమిళ, మలయాళ, హిందీ భాషల ఆడియో రిలీజ్ లు కంప్లీట్ అయిపోయాయి. సోమవారం నుంచి సినిమా పబ్లిసిటీని భారీస్థాయిలో చేపట్టనున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు వీడియో సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో.. జులై 10న రానున్న బాహుబలిపై అంచనాలు మరిన్ని పెరిగాయి.
Next Story