ఈసీని మోసం చేసిన మంత్రి నారాయణ
కాపీరైట్ కేసు ఉన్నా మిస్టర్ క్లీన్‌గా తప్పుడు సమాచారం.. ఏపీ సీఎం చంద్రబాబుకు కొత్త తలనొప్పి ఓటుకు కోట్లు కుంభకోణంలో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రోజుకో కొత్త సమస్య తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఆయన ఎంతో ఇష్టంగా ఏరి కోరి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిపదవి కట్టబెట్టిన పురపాలక శాఖ మంత్రి నారాయణపై గతంలో నమోదైన కాపీరైట్ కేసు బైటపడింది. అయితే ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో తాను మిస్టర్ క్లీన్‌గా నారాయణ తప్పుడు […]
BY Pragnadhar Reddy28 Jun 2015 4:55 AM IST
X
Pragnadhar Reddy Updated On: 29 Jun 2015 5:47 AM IST
కాపీరైట్ కేసు ఉన్నా మిస్టర్ క్లీన్‌గా తప్పుడు సమాచారం.. ఏపీ సీఎం చంద్రబాబుకు కొత్త తలనొప్పి
ఓటుకు కోట్లు కుంభకోణంలో పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రోజుకో కొత్త సమస్య తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఆయన ఎంతో ఇష్టంగా ఏరి కోరి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిపదవి కట్టబెట్టిన పురపాలక శాఖ మంత్రి నారాయణపై గతంలో నమోదైన కాపీరైట్ కేసు బైటపడింది. అయితే ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో తాను మిస్టర్ క్లీన్‌గా నారాయణ తప్పుడు సమాచారం ఇచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాబినెట్‌లో ఓ నేరచరితుడు మంత్రిగా కొనసాగుతున్నాడంటూ ఓ పత్రికలో వచ్చిన కథనం సంచలనం సృష్టిస్తోంది. నిషిత్ మల్టీమీడియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్, నారాయణ విద్యాసంస్థల అధినేత, ప్రస్తుత ఏపీ మున్సిపల్ పరిపాలనా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా కొనసాగుతున్న పొంగూరు నారాయణ 2010లో కాపీ రైట్ ఉల్లంఘన చట్టం కేసులో ఉన్నారని ఆ కథనం తెలుపుతోంది. వివరాలలోకి వెళితే… తెలుగు అకాడమీ ముద్రించే పుస్తకాలను కాపీ కొట్టి నిషిత్ మల్టీమీడియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో తమ పేర్లతో పుస్తకాలను ముద్రించుకొని యధేచ్ఛగా విద్యార్ధులకు అమ్ముకున్న ఘటన గతంలో సంచలనం రేకెత్తించింది. తెలుగు అకాడమీ పుస్తకాలకు కాపీ రైట్ ఉండటంతో ఆ చట్టం ఉల్లంఘన కింద నారాయణపై నారాయణగూడ పోలీస్ స్టేషన్‌లో 2010 సెప్టెంబర్ 9న ఎఫ్‌ఐఆర్ నం. 356/2010, సెక్షన్ 63ఎ కింద కేసు నమోదయింది. అదేరోజు రాత్రి చెంగిచర్లలోని నారాయణ ముద్రణా కేంద్రంపై పోలీసులు దాడులు నిర్వహించి సీల్ వేశారు. నారాయణను సైతం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై 2010 సెప్టెంబర్ 11న పలు పత్రికల్లో వార్తా కథనాలు వచ్చాయి. ఈ ఉదంతంలో ఆయన భార్య, కుమార్తెపై కూడా కేసు నమోదు కాగా, తెలుగు అకాడమీకి రూ.9 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు తెలిసింది. దీనిపై 2010 అక్టోబర్ 7న హైకోర్టులో డబ్ల్యూపీ 25579/ 2010 పేరుతో పిటిషన్ దాఖలైంది. ప్రస్తుతం ఆ కేసు పెండింగ్‌లో ఉంది. ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే నారాయణ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికై మంత్రి పదవి చేపట్టారు. ఎన్నికల్లో అవసరమైన అన్ని పనుల్లో తనకు చేదోడు వాదోడుగా ఉన్నందునే చంద్రబాబు ఎంతోమంది సీనియర్లను కాదని నారాయణకు ప్రభుత్వంలో పెద్దపీట వేశారన్న విమర్శలున్నాయి.
Next Story