Telugu Global
Others

గ‌వ‌ర్న‌ర్‌కు పూర్తి స్వేచ్ఛ

తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌కు కేంద్ర హోంశాఖ పూర్తి స్వాతంత్ర్యం ఇచ్చింది.  ఓటుకు కోట్లు కేసు విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఎలాంటి జోక్యం చేసుకోబోద‌ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌కు స్ప‌ష్టం చేసిన‌ట్లు అత్యున్న‌త స్థాయి వ‌ర్గాలు తెలిపాయి. తెలంగాణ‌లో విచార‌ణ జ‌రుగుతున్న ఓటుకు కోట్లు కేసు, త‌ద‌నంత‌ర ప‌రిణామాల నేప‌థ్యంలో  ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ను ఢిల్లీకి పిలిపించిన కేంద్రం ఈ విష‌యంపై స్ప‌ష్ట‌త ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఓటుకు కోట్లు కేసులో కేంద్రం […]

తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌కు కేంద్ర హోంశాఖ పూర్తి స్వాతంత్ర్యం ఇచ్చింది. ఓటుకు కోట్లు కేసు విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఎలాంటి జోక్యం చేసుకోబోద‌ని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌కు స్ప‌ష్టం చేసిన‌ట్లు అత్యున్న‌త స్థాయి వ‌ర్గాలు తెలిపాయి. తెలంగాణ‌లో విచార‌ణ జ‌రుగుతున్న ఓటుకు కోట్లు కేసు, త‌ద‌నంత‌ర ప‌రిణామాల నేప‌థ్యంలో ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌ను ఢిల్లీకి పిలిపించిన కేంద్రం ఈ విష‌యంపై స్ప‌ష్ట‌త ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఓటుకు కోట్లు కేసులో కేంద్రం ఎటువంటి డైరెక్ష‌న్ ఇవ్వ‌బోదు.ఆంధ్ర‌ప్ర‌దేశ్ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టంలో పొందుప‌రిచిన సెక్ష‌న్ -8 అంశం, ఓటుకు కోట్లు కేసు వ్య‌వ‌హారం వేర్వేరు అంశాలు. ఈ రెండింటినీ క‌లిపి చూడ‌టం స‌రికాద‌ని కేంద్రం హోంశాఖ గ‌వ‌ర్న‌ర్ కు స్ప‌ష్ట‌త ఇచ్చినట్లు స‌మాచారం. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థికి ఓటు వేయాలంటూ తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌స‌న్‌కు రూ. 5 కోట్లు ఆశ చూపిన ఉదంతంలో టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ‌టం, అందులో చంద్ర‌బాబు నేరుగా ఫోన్‌లో మాట్లాడిన సంభాష‌ణ‌లు దేశ ప్ర‌జ‌ల‌కు వెల్ల‌డైన నేప‌థ్యంలో ఏపీ ప్ర‌భుత్వం విభ‌జ‌న చ‌ట్టంలోని సెక్ష‌న్ -8ను తెర మీద‌కు తెచ్చి కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఈ ప‌రిణామాలు రోజుకో మ‌లుపు తిరుగుతున్న క్ర‌మంలో కేంద్ర హోంమంత్రి గ‌వ‌ర్న‌ర్‌ను గ‌త శుక్ర‌వారం ఢిల్లీకి పిలిపించుకుని వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. కేంద్ర హోంశాఖ కార్య‌ద‌ర్శి గోయ‌ల్‌తో కూడా గ‌వ‌ర్న‌ర్ ప‌లు ద‌ఫాలుగా స‌మావేశ‌మ‌య్యారు. ఏపీ ప్ర‌భుత్వం డిమాండ్ చేస్తున్న సెక్ష‌న్ -8 వ్య‌వ‌హారం, ఓటుకు కోట్లు అంశం రెండూ వేర్వేరు అంశాలు. ఓటుకు కోట్లు కేసును విభ‌జ‌న చ‌ట్టంలోని సెక్ష‌న్ -8కు ముడిపెట్ట‌డం స‌రికాదు. ఈ కేసు వ్య‌వ‌హారాన్ని మొత్తంగా ద‌ర్యాప్తు సంస్థ‌లు, న్యాయ‌స్థానాలు చూసుకుంటాయి. హైద‌రాబాద్‌లో శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగిన ప‌క్షంలో గ‌వ‌ర్న‌ర్ సెక్ష‌న్ -8 ద్వారా తెలంగాణ మంత్రివ‌ర్గంతో సంప్ర‌దించి త‌గిన నిర్ణ‌యాన్ని స్వేచ్ఛ‌గా తీసుకోవాల‌ని కేంద్ర హోం మంత్రి, హోంశాఖ కార్య‌ద‌ర్శి గ‌వ‌ర్న‌ర్‌కు సూచించిన‌ట్లు స‌మాచారం.

First Published:  27 Jun 2015 6:35 PM IST
Next Story