కాఫీ తాగడానికి టైమింగ్
వేడివేడిగా పొగలు కక్కే కాఫీ తాగడమంటే మీకిష్టమా…. అయితే, ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల్లోపలే మీకిష్టమైన కాఫీ తాగేయండి. అందువల్ల మీ కోరిక తీరడంతో పాటు చక్కటి ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది. మనం ఎప్పుడు నిద్ర లేవాలి, ఎప్పుడు పడుకోవాలి అనే అంశాలను శరీరంలోని కార్తిసోల్ అనే హార్మోన్ నియంత్రిస్తుంది. ఇది సాధారణంగా ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్య, మధ్యాహ్నం 1 గంట నుంచి 5.30 వరకు, తిరిగి 6.30 […]
వేడివేడిగా పొగలు కక్కే కాఫీ తాగడమంటే మీకిష్టమా…. అయితే, ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల్లోపలే మీకిష్టమైన కాఫీ తాగేయండి. అందువల్ల మీ కోరిక తీరడంతో పాటు చక్కటి ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది. మనం ఎప్పుడు నిద్ర లేవాలి, ఎప్పుడు పడుకోవాలి అనే అంశాలను శరీరంలోని కార్తిసోల్ అనే హార్మోన్ నియంత్రిస్తుంది. ఇది సాధారణంగా ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్య, మధ్యాహ్నం 1 గంట నుంచి 5.30 వరకు, తిరిగి 6.30 గంటలకు ఈ హార్మోన్ విడుదలవుతుంది. అందువల్ల ఈ హార్మోన్ విడుదలయ్యే సమయానికి కాఫీ తీసుకుంటే సహనంగా ఉండడానికి, మందు ప్రభావం తగ్గించడానికి ఉపయోగపడుతుందని అధ్యయనాల్లో తేలింది. అందువల్ల ఎంత ఉదయాన్నే నిద్ర లేచినా కాఫీ మాత్రం ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలోనే తాగండి. మధ్యాహ్నం తాగాలనుకుంటే ఒంటి గంట నుంచి ఐదు గంటల్లోపు తాగాలి. ఒకవేళ భోజనం చేసిన వెంటనే కాఫీ తాగాలనిపించినా ఒక్క గంట విరామం ఇచ్చి తాగండి. ఇలా చేయడం వల్ల భోజనం ప్రయోజనాలు, కాఫీ ప్రయోజనాలు రెండూ శరీరానికి చేరతాయి. రాత్రి పూట మాత్రం 6.30 గంటల్లోపలే కాఫీ తాగాలి. ఆ తర్వాత కాఫీ తాగితే నిద్ర రావడం కష్టమని డాక్టర్లు సూచిస్తున్నారు. కాఫీని సరైన టైములో తాగడం వలన మంచి ఫలితాలు పొందవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.