రజనీకాంత్ అల్లుడికి కోర్టు నోటీసులు..
రజనీకాంత్ కుటుంబంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి. మొన్నటివరకు వరుస ఫ్లాపులు, డిస్ట్రిబ్యూటర్ల ధర్నాలతో అల్లాడిన రజనీ కుటుంబానికి ఇప్పుడు మరో షాక్ తగిలింది. మొన్నటికి మొన్న ఓ కేసులో రజనీ భార్యకు కోర్టు నోటీసులిస్తే.. ఇప్పుడు అల్లుడు ధనుష్ పై కోర్టు కేసు పడింది. జాతీయ అవార్డు పొందిన కాక్క ముట్టయ్ అనే సినిమాకు ధనుష్ సహనిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమాలో ఓ లాయర్ పాత్రను విలన్ గా చూపించారని, న్యాయవాదుల్ని కించపరిచేలా విలన్ పాత్రను చిత్రీకరించారని […]
BY admin28 Jun 2015 3:00 AM IST

X
admin Updated On: 29 Jun 2015 5:54 AM IST
రజనీకాంత్ కుటుంబంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి. మొన్నటివరకు వరుస ఫ్లాపులు, డిస్ట్రిబ్యూటర్ల ధర్నాలతో అల్లాడిన రజనీ కుటుంబానికి ఇప్పుడు మరో షాక్ తగిలింది. మొన్నటికి మొన్న ఓ కేసులో రజనీ భార్యకు కోర్టు నోటీసులిస్తే.. ఇప్పుడు అల్లుడు ధనుష్ పై కోర్టు కేసు పడింది. జాతీయ అవార్డు పొందిన కాక్క ముట్టయ్ అనే సినిమాకు ధనుష్ సహనిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమాలో ఓ లాయర్ పాత్రను విలన్ గా చూపించారని, న్యాయవాదుల్ని కించపరిచేలా విలన్ పాత్రను చిత్రీకరించారని ఆరోపిస్తూ చెన్నై మెట్రోపోలిటన్ కోర్టులో ధనుష్ పై కేసు నమోదైంది. కేసు నమోదవ్వడమే కాదు.. ధనుష్ కు సమన్లు కూడా అందాయి. ఆగస్ట్ 6లోగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని సమన్లలో పేర్కొన్నారు. ఈ కేసులో ధనుష్ తో పాటు మరో సహనిర్మాత వేట్రిమారన్, సినిమా దర్శకుడు మణికందన్ కు కూడా నోటీసులు జారీ అయ్యాయి.
Next Story