రొమ్ము క్యాన్సర్ వాస్తవాలు
మహిళలను వేధించే ఆరోగ్య సమస్యల్లో రొమ్ము క్యాన్సర్ కూడా ప్రధానమైంది. ఈ క్రమంలో ప్రతి మహిళా దీని గురించి అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. రొమ్ము క్యాన్సర్ కి సంబంధించి మహిళల్లో కొన్ని అపోహలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన అపోహలేమిటో, వాస్తవాలేమిటో తెలుసుకోకపోతే మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఈనేపథ్యంలో రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించిన కొన్ని అపోహలు, వాస్తవాలు తెలుసుకుందాం. రొమ్ముల్లో కనిపించే గడ్డలన్నీ క్యాన్సర్ గడ్డలా ఇది నిజం కాదు. రొమ్ములో కనిపించే […]
మహిళలను వేధించే ఆరోగ్య సమస్యల్లో రొమ్ము క్యాన్సర్ కూడా ప్రధానమైంది. ఈ క్రమంలో ప్రతి మహిళా దీని గురించి అవగాహన పెంచుకోవడం చాలా అవసరం. రొమ్ము క్యాన్సర్ కి సంబంధించి మహిళల్లో కొన్ని అపోహలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించిన అపోహలేమిటో, వాస్తవాలేమిటో తెలుసుకోకపోతే మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఈనేపథ్యంలో రొమ్ము క్యాన్సర్‌కు సంబంధించిన కొన్ని అపోహలు, వాస్తవాలు తెలుసుకుందాం.
రొమ్ముల్లో కనిపించే గడ్డలన్నీ క్యాన్సర్ గడ్డలా
ఇది నిజం కాదు. రొమ్ములో కనిపించే గడ్డల్లో పదింట తొమ్మిది క్యాన్సర్ గడ్డలు కావు. ఒకటి మాత్రమే క్యాన్సర్ గడ్డ కావచ్చు. అయినా నిర్లక్ష్యం చేయడానికి లేదు. ఎలాంటి గడ్డ కనిపించినా వైద్యుల్ని సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం అవసరం.
పెద్ద వయసు స్త్రీలకే వస్తుందా
ఇది పూర్తిగా నిజం కాదు. 90 శాతం రొమ్ము క్యాన్సర్ కేసులు 50 ఏళ్ల పైబడిన స్త్రీలలోనే కనిపిస్తున్నా ఇటీవల చిన్నవయసు వారిలోనూ ఈ క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తున్నాయి.
పురుషులకు రాదా
ఈ క్యాన్సర్ కేవలం స్త్రీలకు మాత్రమే వస్తుందని భావించడం నిజం కాదు. రొమ్ము కణజాలం పురుషులకూ ఉంటుంది. కొంతమంది పురుషులకూ ఈ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది.
ఎందుకు వస్తుందో తెలుసా
ఇందులో కొంతవరకే వాస్తవం ఉంది. రొమ్ము క్యాన్సర్ ముప్పును పెంచే కొన్ని అంశాలను డాక్టర్లు గుర్తించారు. స్త్రీలకు వయసు పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. కుటుంబంలో రొమ్ము క్యాన్సర్ చరిత్ర, 12 ఏళ్ల కంటే ముందే రజస్వల కావడం, 55 ఏళ్ల కంటే ముందే నెలసరి ఆగిపోవడం, పిల్లలు లేకపోవడం, 30 ఏళ్ల తర్వాతే తొలి సంతానం కలగడం, హార్మోన్ మాత్రలు ఎక్కువగా వాడడం, బరువు ఎక్కువగా పెరగడం… ఇవన్నీ రొమ్ము క్యాన్సర్ ముప్పు పెంచేవే.
మామోగ్రఫీ ద్వారా గుర్తించవచ్చు
మామోగ్రఫీ పరీక్ష ద్వారా రొమ్ము క్యాన్సర్ గడ్డలు చేతికి తగలక ముందే గుర్తించవచ్చు. ముందే గడ్డలు గుర్తించడం వల్ల చికిత్స చాలా సులభమవుతుంది. అందుకే 40 ఏళ్లు పైబడిన స్త్రీలంతా మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలి. ఈ పరీక్ష సాధారణ ఎక్స్‌రే మాదిరిగా ఉంటుంది. కొంత అసౌకర్యంగా ఉన్నప్పటికీ ఎలాంటి నొప్పీ ఉండదు. ప్రత్యేకించి డిజిటల్ మామోగ్రామ్‌తో పరీక్ష చేయించుకుంటే సౌకర్యంగా ఉంటుంది.