ఏపీతో తెలంగాణ గిల్లికజ్జాలు
తెలంగాణ ప్రభుత్వం కావాలనే ఏపీ ప్రభుత్వంతో గిల్లికజ్జాలు పెట్టుకొంటోందని, అయితే ఆంధ్రుల ఆత్మగౌరవంపై ఎవరితోనూ రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. హైదరాబాద్ రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని అన్న విషయం తెలంగాణ ప్రభుత్వం మరిచి పోయి ప్రవర్తిస్తోందని ఆయన విమర్శించారు. విభజన చట్టం ప్రకారం సెక్షన్ 8పై గవర్నర్‌కు అధికారం ఉంది. అయితే, గవర్నర్ ఈ అంశాలపై క్రియాశీలకంగా వ్యవహరించడం లేదని సీఎం విమర్శించారు. ఏపీ మంత్రులు, అధికారులపై టీ.సర్కారు పెత్తనం […]
తెలంగాణ ప్రభుత్వం కావాలనే ఏపీ ప్రభుత్వంతో గిల్లికజ్జాలు పెట్టుకొంటోందని, అయితే ఆంధ్రుల ఆత్మగౌరవంపై ఎవరితోనూ రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. హైదరాబాద్ రెండు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని అన్న విషయం తెలంగాణ ప్రభుత్వం మరిచి పోయి ప్రవర్తిస్తోందని ఆయన విమర్శించారు. విభజన చట్టం ప్రకారం సెక్షన్ 8పై గవర్నర్‌కు అధికారం ఉంది. అయితే, గవర్నర్ ఈ అంశాలపై క్రియాశీలకంగా వ్యవహరించడం లేదని సీఎం విమర్శించారు. ఏపీ మంత్రులు, అధికారులపై టీ.సర్కారు పెత్తనం చెలాయించడమేంటని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్ పదేళ్ల తర్వాత మాత్రమే తెలంగాణ రాజధాని అన్న విషయాన్ని అక్కడి ప్రభుత్వం గుర్తుంచుకోవాలని సీఎం బాబు సూచించారు. అప్పటి వరకూ ఉద్యోగుల భద్రత, ఆంధ్రుల ఆత్మగౌరవంపై ఎవరితోనూ రాజీ పడే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు.