అనూహ్య హత్య కేసులో సాక్ష్యాల నమోదు
ముంబైలో గత ఏడాది అత్యాచారం, హత్యకు గురైన ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఈస్తర్ అనూహ్య(23) కేసులో స్థానిక సెషన్స్ కోర్టు 39 మంది సాక్షుల వాంగ్మూలాల నమోదును పూర్తి చేసింది. టీసీఎస్ కంపెనీ అసిస్టెంట్ సిస్టమ్ ఇంజినీర్ అయిన ఆమె నిరుడు జనవరి 5న ముంబై వచ్చినప్పుడు ఈ ఘోరం జరిగింది. కుర్లా రైల్వే స్టేషన్‌లోని లోకమాన్య తిలక్ టెర్మినస్ వద్ద దిగిన తర్వాత అనూహ్య అదృశ్యమయ్యింది. రైల్వే స్టేషన్‌లో ఒంటరిగా కూర్చున్న ఆమెను […]
BY admin26 Jun 2015 6:50 PM IST
admin Updated On: 27 Jun 2015 10:10 AM IST
ముంబైలో గత ఏడాది అత్యాచారం, హత్యకు గురైన ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఈస్తర్ అనూహ్య(23) కేసులో స్థానిక సెషన్స్ కోర్టు 39 మంది సాక్షుల వాంగ్మూలాల నమోదును పూర్తి చేసింది. టీసీఎస్ కంపెనీ అసిస్టెంట్ సిస్టమ్ ఇంజినీర్ అయిన ఆమె నిరుడు జనవరి 5న ముంబై వచ్చినప్పుడు ఈ ఘోరం జరిగింది. కుర్లా రైల్వే స్టేషన్‌లోని లోకమాన్య తిలక్ టెర్మినస్ వద్ద దిగిన తర్వాత అనూహ్య అదృశ్యమయ్యింది. రైల్వే స్టేషన్‌లో ఒంటరిగా కూర్చున్న ఆమెను చంద్రభాన్ సనప్(28) అనే వ్యక్తి తన బైక్‌పై లిఫ్ట్ ఇస్తానని మభ్యపెట్టి నిర్జన ప్రదేశానికి తీసుకుపోయాడు. అనూహ్య దగ్గర ఉన్న డబ్బును దోచుకునేందుకు ప్రయత్నించగా, ఆమె ప్రతిఘటించడంతో చంపేశాడని పోలీసులు తెలిపారు. ఆమె అత్యాచారానికి కూడా గురైనట్లుగా అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన జరిగిన 11 రోజుల తర్వాత ఆమె మృతదేహాన్ని ముంబై శివారులో భండప్ వద్ద పోలీసులు కనుగొన్నారు. ఈకేసుకు సంబంధించి ఇప్పటి వరకు 39 మందిని విచారించి సాక్ష్యాలను నమోదు చేశారు.
Next Story