గవర్నర్ ను మార్చేస్తారా?
ఓటుకు నోటు కేసు కీలక దశకు చేరుకుంటున్న సమయంలో చంద్రబాబు రాజకీయాలూ పెరిగిపోతున్నాయి. రోజుకో అంశంతో వింత వాదనలకు తెరతీస్తోన్న ఆయన తాజాగా మరో దిశగా తెరవెనక పావులు కదుపుతున్నారని సమాచారం. ఈకేసులో చంద్రబాబు ప్రమేయంపై ఆడియో టేపులు విడుదలైన నుంచి బాబు రోజుకో అంశాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు. కేంద్రం చేతులెత్తేయడంతో దిక్కు తోచక సెక్షన్-8 అంటూ కొత్తపాట అందుకున్నారు. హైదరాబాద్‌లో ఏపీవాసులకు రక్షణ లేదు అంటూ నెత్తీ నోరు బాదుకున్నారు. చంద్రబాబును అరెస్టు చేస్తారని ఊహాగానాలు […]
ఓటుకు నోటు కేసు కీలక దశకు చేరుకుంటున్న సమయంలో చంద్రబాబు రాజకీయాలూ పెరిగిపోతున్నాయి. రోజుకో అంశంతో వింత వాదనలకు తెరతీస్తోన్న ఆయన తాజాగా మరో దిశగా తెరవెనక పావులు కదుపుతున్నారని సమాచారం. ఈకేసులో చంద్రబాబు ప్రమేయంపై ఆడియో టేపులు విడుదలైన నుంచి బాబు రోజుకో అంశాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు. కేంద్రం చేతులెత్తేయడంతో దిక్కు తోచక సెక్షన్-8 అంటూ కొత్తపాట అందుకున్నారు. హైదరాబాద్‌లో ఏపీవాసులకు రక్షణ లేదు అంటూ నెత్తీ నోరు బాదుకున్నారు. చంద్రబాబును అరెస్టు చేస్తారని ఊహాగానాలు రాగానే ఆయన నివాసం ముందు భారీగా ఏపీ పోలీసులను మోహరించారు. గవర్నర్, కేంద్రం ఆగ్రహం వ్యక్తంచేయడంతో అదనపుబలగాలను ఉపసంహరించారు. ఈ పాచిక పారకపోవడంతో మంత్రులు, ఎమ్మెల్సీల చేత గవర్నర్‌పై మాటలదాడి చేయించారు. ఏపీమంత్రుల వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన గవర్నర్ నరసింహన్ ఒక దశలో రాజీనామాకు సిద్ధపడగా.. కేంద్రం సర్దిచెప్పినట్లు సమాచారం. గవర్నర్‌పై టీడీపీ నేతలు వాడిన భాషపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేయడంతో వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారే తప్ప పశ్చాత్తాపంగానీ, కనీసం విచారంగానీ వ్యక్తం చేయలేదు. రెండురోజులు ఆగి తిరిగి గవర్నర్‌ను విమర్శించడం మొదలు పెట్టారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. కేసు నుంచి ఎలాగైనా బయటపడాలని ఆయన చేయని ప్రయత్నం లేదు..
ఆత్మరక్షణలో పడ్డారా?
ఓటుకు నోటు కేసులో ఒక రాష్ర్ట ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఆత్మరక్షణలలో పడ్డారు. తన రాజకీయ జీవితానికి మరక అంటుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఏపీలో పోలీసు, ప్రభుత్వ విభాగాలు నిందితులకు బాసటగా నిలుస్తుండటం ఆయన ఎక్కడ అరెస్టు అవుతారో అన్న ఆందోళనకు అద్దం పడుతున్నాయి. దీంతో గవర్నర్‌ను మార్చాలని కొత్త వ్యూహం అమలు చేస్తున్నారని తాజా సమాచారం. తనకు ఉన్న పలుకుబడితో గవర్నర్ స్థానంలో తనకు అనుకూలంగా వ్యవహరించే వ్యక్తిని తీసుకురావాలని కేంద్రంలోని పెద్దలపై ఒత్తిడి తెస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇలాంటి దశలో గవర్నర్‌ను మారిస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని కేంద్రం చంద్రబాబు విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించిందని తెలిసింది. దీంతో చంద్రబాబు ఇప్పుడు ఏ అంశాన్ని తెరపైకి తీసుకువస్తారు అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.