సమయపాలనపై వెంకయ్య క్లాస్!
సమయ పాలన, క్రమశిక్షణకు మారు పేరు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు. వారు ఎంపీలైనా, విలేకరులైనా సమయపాలనలో క్రమశిక్షణ పాటించకపోతే ఆయనకు నచ్చదు. మొహం మీదే ఆ మాట చెప్పేస్తారు. అందరి ముందూ హెడ్మాస్టారు తరహాలో క్లాస్ తీసుకుంటారు. తాజాగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన దేశంలోని 500 నగరాలు, పట్టణాల మేయర్లు, మున్సిపల్ కమిషనర్లకు క్రమశిక్షణపై ఆయన క్లాస్ పీకారు. ఉదయం 9.30 గంటలకే సదస్సును ప్రారంభిద్దామని చెప్పినా సమయానికి రాకపోయే సరికి వెంకయ్య […]
BY sarvi26 Jun 2015 6:56 PM IST
X
sarvi Updated On: 27 Jun 2015 2:40 PM IST
సమయ పాలన, క్రమశిక్షణకు మారు పేరు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు. వారు ఎంపీలైనా, విలేకరులైనా సమయపాలనలో క్రమశిక్షణ పాటించకపోతే ఆయనకు నచ్చదు. మొహం మీదే ఆ మాట చెప్పేస్తారు. అందరి ముందూ హెడ్మాస్టారు తరహాలో క్లాస్ తీసుకుంటారు. తాజాగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన దేశంలోని 500 నగరాలు, పట్టణాల మేయర్లు, మున్సిపల్ కమిషనర్లకు క్రమశిక్షణపై ఆయన క్లాస్ పీకారు. ఉదయం 9.30 గంటలకే సదస్సును ప్రారంభిద్దామని చెప్పినా సమయానికి రాకపోయే సరికి వెంకయ్య నాయుడికి కోపం కలిగింది. దీంతో క్రమ శిక్షణ గురించి వారికి హితబోధ చేశారు. సమయపాలన, క్రమశిక్షణకు ఎలాంటి ఖర్చూ అవ్వదని, పైగా ప్రపంచాన్ని గెలిచే గౌరవం, ఆత్మవిశ్వాసం లభిస్తాయని చెప్పారు. తన జీవితానుభవాలను, సీనియర్లైన వాజ్‌పేయి, అద్వానీల నుంచి పొందిన స్ఫూర్తిని వెంకయ్య నెమరువేసుకున్నారు. వయస్సు, సమయం తిరిగి రానివని, వీటిని సద్వినియోగం చేసుకోవడం అందరి బాధ్యతని ఆయన గుర్తు చేశారు.
Next Story