Telugu Global
Others

‘తత్కాల్‌’ కష్టాలు తీరిపోనున్నాయ్!

రైలు ప్రయాణికుల తత్కాల్‌ ఇక్కట్లు తీరనున్నాయి. వెబ్‌సైట్లో టికెట్లు బుక్‌ చేసుకునేవారి సౌకర్యార్థం సర్వర్ల సంఖ్యను 5 నుంచి 10కి పెంచనున్నట్లు ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) సీఎండీ ఎ.కె.మనోచ తెలిపారు. ప్రస్తుతం ఉదయం 10 గంటలు కాగానే ఈ-టికెట్ల కోసం విపరీతమైన రద్దీ ఉంటోంది. తత్కాల్‌ టికెట్ల కోసం అందరూ ఒకేసారి ప్రయత్నిస్తుండటంతో 15 నిమిషాలపాటు సర్వర్లపై ఒకేసారి భారంపడి.. అవి మొరాయిస్తున్న సందర్భాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఇకపై ఈ కష్టాలు […]

‘తత్కాల్‌’ కష్టాలు తీరిపోనున్నాయ్!
X
రైలు ప్రయాణికుల తత్కాల్‌ ఇక్కట్లు తీరనున్నాయి. వెబ్‌సైట్లో టికెట్లు బుక్‌ చేసుకునేవారి సౌకర్యార్థం సర్వర్ల సంఖ్యను 5 నుంచి 10కి పెంచనున్నట్లు ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) సీఎండీ ఎ.కె.మనోచ తెలిపారు. ప్రస్తుతం ఉదయం 10 గంటలు కాగానే ఈ-టికెట్ల కోసం విపరీతమైన రద్దీ ఉంటోంది. తత్కాల్‌ టికెట్ల కోసం అందరూ ఒకేసారి ప్రయత్నిస్తుండటంతో 15 నిమిషాలపాటు సర్వర్లపై ఒకేసారి భారంపడి.. అవి మొరాయిస్తున్న సందర్భాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఇకపై ఈ కష్టాలు తొలగిపోనున్నాయి. ప్రస్తుతం 54 శాతం వెబ్‌సైట్లో టికెట్లు బుక్‌ చేసుకుంటున్నారు. రోజుకు ఐదున్నర నుంచి ఆరు లక్షల టికెట్లు వెబ్‌సైట్లో విక్రయిస్తుండగా తత్కాల్‌ ప్రయాణికులకు రికార్డుస్థాయిలో నిమిషానికి 14,800 టికెట్ల జారీచేస్తున్నారు. కొత్త సర్వర్ల ఏర్పాటుతో దీనికి రెట్టింపు సంఖ్యలో టికెట్లు జారీచేసే అవకాశం ఉంటుంది.
First Published:  26 Jun 2015 1:15 PM GMT
Next Story