స్మార్ద్ సిటీల ఎంపికకు జనాభాయే ప్రాతిపదిక: వెంకయ్య
పట్టణ జనాభా ఆధారంగానే స్మార్ట్‌సిటీలను ఎంపిక చేశామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ సిటీల ఎంపికలో ఎలాంటి వివక్ష పాటించలేదని, కేవలం జనాభా ఒక్కటే దీనికి ప్రాతిపదికగా భావించామని ఆయన వివరించారు. కొంతమంది చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ తెలుగు రాష్ట్రాలు రెండూ తమకు ఒకటేనని పథకాలు,నిధుల మంజూరులో ఎలాంటి వివక్షా పాటించబోమని ఆయన తెలిపారు. పథకాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనన్నారు. తెలుగు రాష్ర్టాల్లో నెలకొన్న వివాదాలకు కేంద్రం విడుదల చేసే నిధులకు ఎలాంటి సంబంధం […]
BY admin26 Jun 2015 6:43 PM IST
X
admin Updated On: 27 Jun 2015 8:48 AM IST
పట్టణ జనాభా ఆధారంగానే స్మార్ట్‌సిటీలను ఎంపిక చేశామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ సిటీల ఎంపికలో ఎలాంటి వివక్ష పాటించలేదని, కేవలం జనాభా ఒక్కటే దీనికి ప్రాతిపదికగా భావించామని ఆయన వివరించారు. కొంతమంది చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ తెలుగు రాష్ట్రాలు రెండూ తమకు ఒకటేనని పథకాలు,నిధుల మంజూరులో ఎలాంటి వివక్షా పాటించబోమని ఆయన తెలిపారు. పథకాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనన్నారు. తెలుగు రాష్ర్టాల్లో నెలకొన్న వివాదాలకు కేంద్రం విడుదల చేసే నిధులకు ఎలాంటి సంబంధం లేదని కేంద్రమంత్రి ఆయన వివరించారు.
Next Story