రేవంత్‌కు బెయిల్ రాకపోవడానికి టీడీపీయే కారణం?
ఓటుకు నోటు కేసులో ఎ-1 నిందితుడు ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి బెయిల్ రాలేదు. ఆయన కేసు విచారణ ఈనెల 30కి వాయిదాపడింది. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి బెయిల్ రాకపోవడానికి టీడీపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు కారణంగా కనిపిస్తోంది. ఆ ఇద్దరు ఎవరంటే.. ఈ కేసులో ఎ-4 నిందితుడిగా ఉన్న మత్తయ్య, ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. వీరిలో ఇప్పటికే ఏసీబీ నుంచి నోటీసులు అందుకున్న సండ్ర పరారీలో (ఏపీలో తలదాచుకున్నట్లు సమాచారం) ఉన్నాడు. ఇక ఎ-4 […]
ఓటుకు నోటు కేసులో ఎ-1 నిందితుడు ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి బెయిల్ రాలేదు. ఆయన కేసు విచారణ ఈనెల 30కి వాయిదాపడింది. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి బెయిల్ రాకపోవడానికి టీడీపీకి చెందిన ఇద్దరు వ్యక్తులు కారణంగా కనిపిస్తోంది. ఆ ఇద్దరు ఎవరంటే.. ఈ కేసులో ఎ-4 నిందితుడిగా ఉన్న మత్తయ్య, ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. వీరిలో ఇప్పటికే ఏసీబీ నుంచి నోటీసులు అందుకున్న సండ్ర పరారీలో (ఏపీలో తలదాచుకున్నట్లు సమాచారం) ఉన్నాడు. ఇక ఎ-4 నిందితుడు జెరుసలేం మత్తయ్య ఏపీలో తలదాచుకున్న సంగతి తెలిసిందే. (అతని కేసును ఏపీ ప్రభుత్వమే స్వయంగా పర్యవేక్షిస్తుంది). వీరిద్దరూ ఇంతవరకూ విచారణకు హాజరుకాకపోవడం వల్ల దర్యాప్తు పూర్తి కాలేదని తెలంగాణ అడ్వకేట్ జనరల్ (ఏజీ) రామకృష్ణారెడ్డి వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. రేవంత్‌రెడ్డి తరఫు న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదిస్తూ..నిబంధనల ప్రకారం నడుచుకుంటామని, గతంలో తన కూతురు నిశ్చితార్థం సమయంలో రేవంత్ నిబంధనలను పాటించారని చెప్పారు. ఏజీ కలుగజేసుకుని కేసు విచారణ పూర్తి కాలేదని, ప్రధాన నిందితుల్లో ఇద్దరిని ఇంకా విచారించలేదని గుర్తు చేశారు. నిందితులంతా టీడీపీకి చెందిన వారని, వారి ప్రభుత్వం ఏపీలో, కేంద్రంలో అధికారంలో ఉందని పేర్కొన్నారు. వారు బయటికి వస్తే తప్పకుండా సాక్ష్యాలను తారుమారు చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. మిగిలిన రూ.4.5 కోట్ల డబ్బు ఎక్కడుంది? ఇంకా కాల్‌డేటాను విశ్లేషించాల్సిన అవసరముందని వాదించారు. న్యాయమూర్తి మాత్రం ఎమ్మెల్యే సండ్ర, మత్తయ్య ఇంతవరకు విచారణకు హాజరుకాకపోవడం, బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు అనే రెండు ప్రధానాంశాలనే పరిగణనలోకి తీసుకుని బెయిల్‌పై తీర్పును జూన్ 30కి వాయిదా వేశారు. నిందితులకు దన్నుగా నిలుస్తోన్న టీడీపీనే మిగిలిన వారికి బెయిల్ రాకుండా చేసిందన్నమాట.