Telugu Global
NEWS

వ‌ర్జిన్ రాక్ కేసులో ధ‌ర్మాన‌కు ఊర‌ట‌!

ఐదేళ్లుగా కొన‌సాగుతున్న వ‌ర్జిన్‌రాక్ మైనింగ్ కేసులో మాజీమంత్రి, వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావుకు ఎట్ట‌కేల‌కు ఊర‌ట ల‌భించింది. ధ‌ర్మాన కుటుంబానికి చెందిన వ‌ర్జిన్‌రాక్ సంస్థ ఎలాంటి అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌లేద‌ని లోకాయుక్త తీర్పు చెప్పింది. ఈకేసు పూర్వాప‌రాలిలా ఉన్నాయి. ధ‌ర్మాన కుమారుడు రామ్ మ‌నోహ‌ర్ నాయుడు ఎండీగా వ్య‌వ‌హ‌రిస్తున్న వ‌ర్జిన్‌రాక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శ్రీ‌కాకుళం జిల్లా సీతంపేట మండ‌లం పులిపుట్టి ప్రాంతంలో గ్రానైట్ త‌వ్వ‌కాల‌కు అనుమ‌తి కోరుతూ 2010లో ద‌ర‌ఖాస్తు చేసుకుంది. ఈ మేర‌కు […]

వ‌ర్జిన్ రాక్ కేసులో ధ‌ర్మాన‌కు ఊర‌ట‌!
X

ఐదేళ్లుగా కొన‌సాగుతున్న వ‌ర్జిన్‌రాక్ మైనింగ్ కేసులో మాజీమంత్రి, వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావుకు ఎట్ట‌కేల‌కు ఊర‌ట ల‌భించింది. ధ‌ర్మాన కుటుంబానికి చెందిన వ‌ర్జిన్‌రాక్ సంస్థ ఎలాంటి అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌లేద‌ని లోకాయుక్త తీర్పు చెప్పింది. ఈకేసు పూర్వాప‌రాలిలా ఉన్నాయి. ధ‌ర్మాన కుమారుడు రామ్ మ‌నోహ‌ర్ నాయుడు ఎండీగా వ్య‌వ‌హ‌రిస్తున్న వ‌ర్జిన్‌రాక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శ్రీ‌కాకుళం జిల్లా సీతంపేట మండ‌లం పులిపుట్టి ప్రాంతంలో గ్రానైట్ త‌వ్వ‌కాల‌కు అనుమ‌తి కోరుతూ 2010లో ద‌ర‌ఖాస్తు చేసుకుంది. ఈ మేర‌కు అప్ప‌టి సీతంపేట త‌హ‌శీల్దార్‌, మైనింగ్ ఏడీ, మండ‌ల స‌ర్వేయ‌ర్‌, ఏడీ స‌ర్వే/ల‌్యాండ్స్ విభాగం అధికారులు ఎన్ఓసీ జారీకి అనుమ‌తించారు. అయితే అప్ప‌టి నుంచి ఈ వ్య‌వ‌హారంపై వివాదాలు మొద‌ల‌య్యాయి. స్థానిక గిరిజ‌నుల‌తో టీడీపీ నాయ‌కుడు ఎర్ర‌న్నాయుడు కోర్టుల్లో వ్యాజ్యాలు వేయించార‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. హైకోర్టుతో పాటు లోకాయుక్త‌లోనూ వీటిపై విచార‌ణ‌లు న‌డిచాయి. ఈ నేప‌థ్యంలో లోకాయుక్త నుంచి అనుకూలంగా తీర్పు వ‌చ్చింది. మైనింగ్‌, రెవెన్యూ అధికారులు స‌రిగా వ్య‌వ‌హ‌రించ‌క‌పోవ‌డం వ‌ల్లే ఈ వివాదం త‌లెత్తింద‌ని లోకాయుక్త త‌న తీర్పులో పేర్కొంది. వ‌ర్జిన్‌రాక్ సంస్థ‌వైపు నుంచి ఎలాంటి త‌ప్పిద‌మూ లేద‌ని తెలిపింది. ఆ సంస్థ‌కు కేటాయించిన భూములు స‌ర్వే చేయించి ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించి అప్ప‌గించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్‌ను ఆదేశించింది. అయితే ఈ తీర్పు ప్ర‌తి ధ‌ర్మాన‌కు ఆల‌స్యంగా అందింది. మే 19న తీర్పు వ‌స్తే తీర్పు ప్ర‌తి జూన్ 26న అందింది. తాను వైఎస్ఆర్‌సీపీలో ఉన్నాన‌నే క‌క్ష‌తో టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌హా చాలా మంది త‌న‌కు, త‌న కుటుంబానికి వ్య‌తిరేకంగా దుష్ర్ప‌చారం చేశార‌ని ధ‌ర్మాన గుర్తు చేశారు. ఎవ‌రెంత ప్ర‌య‌త్నించినా అంతిమంగా ధ‌ర్మ‌మే విజ‌యం సాధించింద‌న్నారు.

First Published:  27 Jun 2015 5:29 AM IST
Next Story