Telugu Global
Cinema & Entertainment

టైగర్ రివ్యూ

రేటింగ్: 2.75/5 పౌష్టికాహారం వద్దు.. పాప్ కార్న్ ముద్దు! యిది మన నినాదం! యిది మన సినిమా! నిజానికి బలవర్ధకమైన ఆహారమైనా దానిలో బలం తీసేసి.. ఎంచక్కా రంగూ రుచీ అంతకు మించి ఆకర్షణకు అలవాటు పడ్డాం. మన తెలుగు సినిమా అందుకు అతీతమైనదేమీ కాదు! ఎంత మంచి కథా వస్తువుని ఎన్నుకున్నా- బలంగా నడపగలిగే అవకాశం వున్నా సరే, దాన్ని కథ కన్నా- హీరోకే ఎక్కువ ప్రాధాన్యత యివ్వడం.. లేదా హీరో సాహసాల కోసమే కథ రూట్ మార్చుకోవడం.. కథ కోసం హీరో […]

టైగర్ రివ్యూ
X

రేటింగ్: 2.75/5

పౌష్టికాహారం వద్దు.. పాప్ కార్న్ ముద్దు! యిది మన నినాదం! యిది మన సినిమా! నిజానికి బలవర్ధకమైన ఆహారమైనా దానిలో బలం తీసేసి.. ఎంచక్కా రంగూ రుచీ అంతకు మించి ఆకర్షణకు అలవాటు పడ్డాం. మన తెలుగు సినిమా అందుకు అతీతమైనదేమీ కాదు! ఎంత మంచి కథా వస్తువుని ఎన్నుకున్నా- బలంగా నడపగలిగే అవకాశం వున్నా సరే, దాన్ని కథ కన్నా- హీరోకే ఎక్కువ ప్రాధాన్యత యివ్వడం.. లేదా హీరో సాహసాల కోసమే కథ రూట్ మార్చుకోవడం.. కథ కోసం హీరో కాక హీరో కోసం కథగా తయారుచేయడం.. దాన్ని కమర్షియల్ ఫార్ములా అనడం అలవాటయిపోయింది. తరువాత ఏమవుతుంది? రొటీన్లో పడుతుంది! యింకా చెప్పాలంటే తెలుగు సినిమా అవుతుంది! ఇదంతా ఎందుకంటారా? పరువు హత్యల కథా వస్తువుని తీసుకొని చేసిన సినిమాకి ‘టైగర్’ అని పేరు పెట్టడంలోనే ఆంతర్యం అర్థమైపోతుంది. సినిమా చూస్తున్న వాళ్ళకి కథా అర్థమైపోతుంది. సినిమా చూసాక ఏ ఫీలూ మిగలదు. పరువు హత్యల మీద కోపమో బాధో దుఖమో ఏమీ కలగదు. తెలుగు సినిమా గిడసబారిన నమూనా వల్ల ఒక మంచి సినిమా కావలసిన టైగర్ మామూలు సినిమాగా మిగిలిపోవడం విషాదం!

అనాథాశ్రమంలో పెరిగిన స్నేహితులు విష్ణు (రాహుల్ రవిచంద్రన్), టైగర్ (సందీప్ కిషన్). విష్ణుని వేరే వాళ్ళు పెంచుకోవడం వల్ల విడిపోతారు. పెద్దయ్యాక మొదలైన కథలో విష్ణుని ఆగంతకులు తరుముతూవుంటారు. అలా జరిగిన యాక్సిడెంట్లో ప్రాణాపాయస్థితిలో హాస్పిటల్లో తీసుకువెలుతుండగా ప్రేమ కథలోకి వెళ్తే- గంగ(సీరత్ కపూర్)ను విష్ణు ప్రేమిస్తాడు. టైగర్ కు ఆ విషయం తెలిసి వస్తాడు. విష్ణుకు లైఫ్ సెట్ చేయాలని అనుకుంటూ అతణ్ణి అతని ప్రేమని అప్సెట్ చేస్తాడు. నీ జీవితంలో నేను ఉండాలో నీ ఫ్రెండ్ ఉండాలో తేల్చుకో మంటుంది గంగ. నువ్వు నా ప్రపంచం.. కానీ వాడికి(టైగర్)కి నేనే ప్రపంచం అని చెప్పినా ఫలితం వుండదు. ప్రేమను కాపాడుకొనే క్రమంలో స్నేహితున్ని దూరం చేసుకుంటాడు విష్ణు. అయితే కాశీకి చెందిన గంగ తండ్రి బిస్వాస్, తాతా ప్రేమను సహించక చంపడానికి సిద్దమవుతారు. ఇంకేముంది? టైగర్ స్నేహితున్ని అతని ప్రేమని ఎలా నిల బెట్టాడన్నదే మిగతా కథ!

విష్ణు ప్రేమ కథ బావుంది. తలిదండ్రులు ఉండాలన్న టైగర్ అభిలాషణ బావుంది. అదే తలిదండ్రులు కులం పేరా పరువుపేర కత్తిగట్టడంలో వాస్తవాలని వదిలి సినిమాగా హీరోయిజంగా మాత్రమే డీల్ చేయడం కథకు న్యాయం చెయ్యలేదు. దర్శకుడు ఇప్పటికే స్టిరపరిచిన తెలుగు సినిమా చట్రంలో ఇమిడిపోవడం చెల్లుబాటు అవుతుందని నమ్మినా- ప్రేక్షకులు ఎప్పటికీ ఆ నమ్మకాన్ని నిలబెట్టలేరు! సందీప్ చురుకుదనం, పాత్రోచితంగా రాహుల్, అందీ అందుకోలేక సీరత్ కపూర్ నటించారు.మంచి మాటలే పలికించారు అబ్బూరి రవి. చోటా కెమెరా ఎప్పటిలానే వుంది. ఇలాంటి సినిమాలకు వుండాల్సిన బ్లాకు కలర్ సేడ్నెస్ లేకుండా కలర్ఫుల్ గా వుంది. తమన్ పాటలు చెప్పుకోదగ్గవిగా లేవు. ఫస్ట్ హాఫ్ బాగానడిపి సెకండాఫ్ రొటీన్ లోపడ్డాడు దర్శకుడు వి ఐ ఆనంద్.

First Published:  26 Jun 2015 3:03 PM IST
Next Story