Telugu Global
Others

రాజస్థాన్‌ సీఎం వ‌సుంధ‌రా రాజేకు పదవీ గండం?

ఐపీఎల్‌ మాజీ అధ్యక్షుడు లలిత్ మోడీ ాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరా రాజేను పీక‌ల్లోతు క‌ష్టాల్లోకి నెట్టి వేశారు. బ్రిటన్‌లో నివాసం ఏర్పరచుకొనేందుకు లలిత్ మోడీకి మద్దతుగా ఆమె స్వయంగా సంతకం చేసిన పత్రాలను కాంగ్రెస్‌ బయటపెట్టి ఆమె పీక‌కు ఉచ్చు బిగించింది. దీంతో రాజస్థాన్‌ సీఎంని బీజేపీ అధిష్టానం వివరణ కోరింది. ఆమెపై 24 గంటల్లో బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. 2011 ఆగస్టు 18న వసుంధరా రాజే సంతకం చేసిన పత్రాలను కాంగ్రెస్‌ […]

రాజస్థాన్‌ సీఎం వ‌సుంధ‌రా రాజేకు పదవీ గండం?
X

ఐపీఎల్‌ మాజీ అధ్యక్షుడు లలిత్ మోడీ ాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరా రాజేను పీక‌ల్లోతు క‌ష్టాల్లోకి నెట్టి వేశారు. బ్రిటన్‌లో నివాసం ఏర్పరచుకొనేందుకు లలిత్ మోడీకి మద్దతుగా ఆమె స్వయంగా సంతకం చేసిన పత్రాలను కాంగ్రెస్‌ బయటపెట్టి ఆమె పీక‌కు ఉచ్చు బిగించింది. దీంతో రాజస్థాన్‌ సీఎంని బీజేపీ అధిష్టానం వివరణ కోరింది. ఆమెపై 24 గంటల్లో బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. 2011 ఆగస్టు 18న వసుంధరా రాజే సంతకం చేసిన పత్రాలను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ మీడియాకు విడుదల చేశారు. అప్పట్లో వసుంధర రాజస్థాన్‌లో విపక్షంలో ఉన్నారు. ‘7 పేజీలు ఉన్న ఈ డాక్యుమెంట్‌లో 21 అంశాలు ఉన్నాయి. లలిత్‌ ఇమ్మిగ్రేషన్‌ దరఖాస్తుకు మద్దతుగా ఈ వాంగ్మూలం ఇస్తున్నట్లు వసుంధర ఆ లేఖలో చెప్పారు. అది కూడా ఈ విషయంలో భారత్‌లోని అధికార వర్గాలకు ఎట్టి పరిస్థితుల్లో తెలియజేయరాదేనే షరతుతో సంతకం చేస్తున్నట్లు వెల్లడించారు. లలిత్‌ తనకు చాలా సన్నిహితుడని అందువల్లే ఆయనపై కాంగ్రెస్‌ పార్టీ పగ పెట్టుకుందని ఆమె తెలిపారు’. తన సంతకం బయట పడిన తర్వాత వసుంధర వైఖరి ఏమిటని జైరాం రమేష్‌ ప్రశ్నించారు. జైరాం రమేష్‌ మీడియాతో మాట్లాడుతూ… వసుంధర ముందు ఈ లేఖ తనది కాదన్నారని, తర్వాత గుర్తుకు రావడం లేదని అన్నారని విమర్శించారు. ఇప్పుడు ఆ పత్రాలన్నీ చూసిన త‌ర్వాత ఏం స‌మాధానం చెబుతార‌ని ప్ర‌శ్నించారు. ఇది ఫోర్జరీ సంతకం కాదని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకు చెప్పాలనుకుంటున్నానని జైరాం రమేష్‌ పేర్కొన్నారు.
వివరణ కోరిన బీజేపీ
తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ ఇరుకునపడినట్లయింది. బ్రిటన్‌లో లలిత్‌ మోదీ నివాసానికి సహకరించడంపై బీజేపీ అధిష్ఠానం వసుంధర రాజే వివరణ కోరింది. అయితే… లలిత్‌ మోదీపై ఉన్న కేసులను తాము నీరుగార్చడంలేదని, కాంగ్రెస్‌ విడుదల చేసిన పత్రాలను పరిశీలిస్తామని బీజేపీ అధికార ప్రతినిధి నళిన్‌ కోహ్లి తెలిపారు. వసుంధర రాజె ఈ పత్రాలపై వ్యక్తిగతంగా సంతకం చేశారా లేక అధికారిక హోదాలో (విపక్ష నేతగా) చేశారా అనేది నిర్ధారించుకోవాల్సి ఉందన్నారు.

First Published:  25 Jun 2015 8:02 PM GMT
Next Story