Telugu Global
NEWS

ఏసీబీ చేతికి ఎఫ్ఎస్ఎల్ నివేదిక

ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియో టేపుల వాస్త‌విక‌త‌పై ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) ఇచ్చిన‌ నివేదిక ప్ర‌తి అవినీతి నిరోధక శాఖ అధికారులకు అందింది. ఇవి తమకు కావాలని కోరుతూ తెలంగాణ ఏసీబీ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం కోర్టులో మెమో దాఖలు చేశారు. సీల్డ్ క‌వ‌ర్‌లో ఉన్న నివేదిక‌ను ఈ ద‌శ‌లో ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని, ఎఫ్ఎస్ఎల్ నుంచి అనుమతి లేఖ తీసుకువస్తే నివేదిక ఇచ్చే విష‌యం ప‌రిశీలిస్తామ‌ని కోర్టు వారికి స్పష్టం చేసినట్లు తెలిసింది. అయితే […]

ఏసీబీ చేతికి ఎఫ్ఎస్ఎల్ నివేదిక
X
ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియో టేపుల వాస్త‌విక‌త‌పై ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) ఇచ్చిన‌ నివేదిక ప్ర‌తి అవినీతి నిరోధక శాఖ అధికారులకు అందింది. ఇవి తమకు కావాలని కోరుతూ తెలంగాణ ఏసీబీ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం కోర్టులో మెమో దాఖలు చేశారు. సీల్డ్ క‌వ‌ర్‌లో ఉన్న నివేదిక‌ను ఈ ద‌శ‌లో ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని, ఎఫ్ఎస్ఎల్ నుంచి అనుమతి లేఖ తీసుకువస్తే నివేదిక ఇచ్చే విష‌యం ప‌రిశీలిస్తామ‌ని కోర్టు వారికి స్పష్టం చేసినట్లు తెలిసింది. అయితే ఏసీబీకి ఈ నివేదిక ప్ర‌తిని ఇవ్వ‌డంలో త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని పేర్కొంటూ ఎఫ్ఎస్ఎల్ ఏసీబీకి ఓ లేఖ అందజేసింది. ఈ లేఖ‌ను కోర్టులో దాఖ‌లు చేసి ఏసీబీ నివేదిక పొందింది. ఇదిలా ఉండగా, రేవంత్ అరెస్ట్‌కు ముందు తెలంగాణ ఏసీబీ చిత్రీకరించిన ఆడియో, వీడియో టేపులు, కేసుకు సంబంధించిన పత్రాల నకళ్లు తమకు కావాలని కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఏసీబీ కోర్టును అభ్యర్థించింది. ఇది ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన వ్యవహారం కావడం వల్ల వాటిని తాము కూడా పరిశీలించాల్సి ఉందని తన మెమోలో తెలిపింది. ఇపుడు ఎన్నికల సంఘానికి కూడా ఈ నివేదికలు అందే అవకాశం ఉందని భావిస్తున్నారు.
First Published:  26 Jun 2015 11:30 AM IST
Next Story