Telugu Global
Cinema & Entertainment

మహేష్‌బాబుపై మండిపడుతున్న అభిమానులు

రెయిన్‌బో ఆసుపత్రిలో చేరిన గర్భిణి డెలివరీకి, పుట్టిన బిడ్డ వైద్యానికి 19 లక్షలు చెల్లించినా, మరో నాలుగు లక్షలు చెల్లించందే తల్లీబిడ్డల్ని డిశ్చార్జ్‌ చేసేది లేదంటూ తల్లీ బిడ్డల్నీ బంధించిన ఆసుపత్రి అమానుషాన్ని ఈరోజు పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. ఈ వార్త చదివి ఇలాంటి ఆసుపత్రుల మీద మండి పడ్డ ప్రజలకు అదే పత్రికలో అదే పేజీలో హీరో మహేశ్‌బాబు రెయిన్‌బో ఆసుపత్రి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఫోటోలకు ఫోజులివ్వడం, రెయిన్‌బో ఆసుపత్రి ప్రమోషన్‌కు యాడ్స్‌లో కనిపించడంపై మహేష్‌ […]

మహేష్‌బాబుపై మండిపడుతున్న అభిమానులు
X

రెయిన్‌బో ఆసుపత్రిలో చేరిన గర్భిణి డెలివరీకి, పుట్టిన బిడ్డ వైద్యానికి 19 లక్షలు చెల్లించినా, మరో నాలుగు లక్షలు చెల్లించందే తల్లీబిడ్డల్ని డిశ్చార్జ్‌ చేసేది లేదంటూ తల్లీ బిడ్డల్నీ బంధించిన ఆసుపత్రి అమానుషాన్ని ఈరోజు పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. ఈ వార్త చదివి ఇలాంటి ఆసుపత్రుల మీద మండి పడ్డ ప్రజలకు అదే పత్రికలో అదే పేజీలో హీరో మహేశ్‌బాబు రెయిన్‌బో ఆసుపత్రి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఫోటోలకు ఫోజులివ్వడం, రెయిన్‌బో ఆసుపత్రి ప్రమోషన్‌కు యాడ్స్‌లో కనిపించడంపై మహేష్‌ అభిమానులు బాధపడ్డారు.
హీరోగా సంపాదించే కోట్ల రూపాయలు చాలడం లేదా? ఇలాంటి దోపిడీ హాస్పిటల్స్‌ తరుపున ప్రచారం చేసి డబ్బు సంపాదించాలా? పురుగు మందుల అవశేషాలుండే కూల్‌డ్రింకుల్ని తాగమని ప్రచారం చేసి డబ్బు సంపాదించాలా? చిన్నపిల్లలు, విద్యార్ధులు మహేష్‌ని అభిమానిస్తారు కాబట్టి మహేష్‌ నటించే కూల్‌డ్రింక్‌ల యాడ్‌ ప్రభావం వాళ్ళమీద చాలా ఉంటుంది. యాడ్స్‌ మీద వచ్చే డబ్బుకోసం మీ అభిమానుల ఆరోగ్యాన్ని దెబ్బతీసే కూల్‌డ్రింక్స్‌ తాగమని ప్రచారం చేస్తారా? అని అభిమానులు మండిపడుతున్నారు.

First Published:  26 Jun 2015 3:14 AM GMT
Next Story