ఉగ్రవాదులు సోదరులా?
ప్రతిపక్షమైనా, అధికార పక్షమైనా ఉగ్రవాదులపై ఒకే విధానం అవలంబించాలి. ఉగ్రవాదులను సోదరులంటూ సంభోందించడం కాంగ్రెస్ మార్కు ఓటు రాజకీయానికే చెల్లింది. అధికారంలో ఉన్నపుడు తాము పట్టుకున్న తీవ్రవాదులే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సోదరులుగా కనిపించడం విచిత్రంగా ఉంది. తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి వరంగల్‌లో జరిగిన ఓ సమావేశంలో రాష్ర్ట ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో ఉగ్రవాదులను సోదరులుగా అభివర్ణించారు. వికారుద్దీన్ ముఠా నల్గొండ జిల్లా ఆలేరు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన సంగతి తెలిసిందే. ముస్లిం […]
ప్రతిపక్షమైనా, అధికార పక్షమైనా ఉగ్రవాదులపై ఒకే విధానం అవలంబించాలి. ఉగ్రవాదులను సోదరులంటూ సంభోందించడం కాంగ్రెస్ మార్కు ఓటు రాజకీయానికే చెల్లింది. అధికారంలో ఉన్నపుడు తాము పట్టుకున్న తీవ్రవాదులే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సోదరులుగా కనిపించడం విచిత్రంగా ఉంది. తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి వరంగల్‌లో జరిగిన ఓ సమావేశంలో రాష్ర్ట ప్రభుత్వాన్ని విమర్శించే క్రమంలో ఉగ్రవాదులను సోదరులుగా అభివర్ణించారు. వికారుద్దీన్ ముఠా నల్గొండ జిల్లా ఆలేరు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన సంగతి తెలిసిందే. ముస్లిం సోదరులను చంపితే ఈ రాష్ర్టంలో దిక్కే లేదు.. అని వికారుద్దీన్ ముఠా హతమైన తీరుపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసలు ఇదంతా ఎందుకంటే.. త్వరలో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగనున్నాయి. ఖాజీపేట, హన్మకొండ, వరంగల్ నగరాలు పరిసర ప్రాంతాల్లో ముస్లిం జనాభా అధికంగా ఉంది. వారిని ప్రసన్నం చేసుకోవడానికి ఉత్తమ్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది.