Telugu Global
Health & Life Style

ఆదర్శ ఆరోగ్య జిల్లాగా గుంటూరు

నవ్యాంధ రాజధాని గుంటూరు జిల్లాను కేంద్రం అమలు చేస్తున్న నూతన ఆరోగ్య పథకంలో పైలెట్‌ ప్రాజెక్ట్‌ కోసం ఎంపిక చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ టి. పద్మజారాణి తెలిపారు. న్యూఢిల్లీలో ఈ నెల 23, 24 తేదీల్లో నిర్వహించిన ప్రాజెక్ట్‌ శిక్షణ కార్యక్రమంలో డాక్టర్‌ పద్మజారాణి పాల్గొన్నారు. ఈ పథకం వివరాలను ఆమె వెల్లడించారు. గ్రామీణ ప్రాంతంలో త్రీ టైర్‌ హెల్త్‌ సిస్టమ్‌లో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే ఉద్దేశంతో కేంద్రం […]

నవ్యాంధ రాజధాని గుంటూరు జిల్లాను కేంద్రం అమలు చేస్తున్న నూతన ఆరోగ్య పథకంలో పైలెట్‌ ప్రాజెక్ట్‌ కోసం ఎంపిక చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ టి. పద్మజారాణి తెలిపారు. న్యూఢిల్లీలో ఈ నెల 23, 24 తేదీల్లో నిర్వహించిన ప్రాజెక్ట్‌ శిక్షణ కార్యక్రమంలో డాక్టర్‌ పద్మజారాణి పాల్గొన్నారు. ఈ పథకం వివరాలను ఆమె వెల్లడించారు. గ్రామీణ ప్రాంతంలో త్రీ టైర్‌ హెల్త్‌ సిస్టమ్‌లో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే ఉద్దేశంతో కేంద్రం కొత్త పథకానికి రూపకల్పన చేసినట్లు డాక్టర్‌ పద్మజారాణి తెలిపారు. తెనాలి జిల్లా కేంద్ర ఆస్పత్రి, దీనికి అనుబంధంగా ఒక కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆరోగ్య ఉప కేంద్రంను ఎంపిక చేస్తామని ఆమె తెలిపారు. మోడల్‌ హెల్త్ డిస్ట్రిక్ట్‌గా ఎంపికైన జిల్లాకు కేంద్రం భారీగా నిధులు సమకూరుస్తుందని చెప్పారు. మన రాష్ట్రంలో పైలెట్‌ ప్రాజెక్ట్‌ కోసం గుంటూరును ఇంటర్వెన్షన్ డిస్ట్రిక్ట్‌గా విశాఖపట్నంను కొలాబరేషన్‌ డిస్ట్రిక్ట్‌గా ఎంపిక చేసినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ పద్మజారాణి వెల్లడించారు.
First Published:  25 Jun 2015 6:39 PM IST
Next Story