డాక్టర్ జి.ఎన్.రావుకు లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డు
ఎల్వీ ప్రసాద్ నేత్ర విజ్ఞాన సంస్థ సీఎండీ డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావుకు ఆస్ట్రేలియన్ అల్యుమిని అసోసియేషన్ ట్రస్టు జీవిత కాల సాఫల్య పురస్కారాన్ని అందజేసింది. నేత్ర వైద్యుడిగా ఆయన అందించిన సేవలకు గాను డాక్టరు రావుకు ఈ అవార్డును ప్రదానం చేసినట్లు ఆస్ట్రేలియా పార్లమెంటరీ కార్యదర్శి స్టీవెన్ సియాబో అన్నారు. ఆస్ట్రేలియన్ అల్యుమిని అసోసియేన్ ట్రస్టు ఆధ్వర్యంలో గురవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో స్టీవెన్ డాక్టరు రావుకు అవార్డు అందచేశారు. ఈ సందర్భంగా డాక్టరు రావు మాట్లాడుతూ […]
ఎల్వీ ప్రసాద్ నేత్ర విజ్ఞాన సంస్థ సీఎండీ డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావుకు ఆస్ట్రేలియన్ అల్యుమిని అసోసియేషన్ ట్రస్టు జీవిత కాల సాఫల్య పురస్కారాన్ని అందజేసింది. నేత్ర వైద్యుడిగా ఆయన అందించిన సేవలకు గాను డాక్టరు రావుకు ఈ అవార్డును ప్రదానం చేసినట్లు ఆస్ట్రేలియా పార్లమెంటరీ కార్యదర్శి స్టీవెన్ సియాబో అన్నారు. ఆస్ట్రేలియన్ అల్యుమిని అసోసియేన్ ట్రస్టు ఆధ్వర్యంలో గురవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో స్టీవెన్ డాక్టరు రావుకు అవార్డు అందచేశారు. ఈ సందర్భంగా డాక్టరు రావు మాట్లాడుతూ జీవితకాల సాఫల్య పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందన్నారు. ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి ఇప్పటికే పలు ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయాలతో కలిసి పని చేస్తోందని, భవిష్యత్‌లో మెల్‌బోర్న్, న్యూసౌత్‌వేల్స్, జార్జ్ వర్శిటీలతో కలిసి ముందుకెళతామని అన్నారు. ఈ కార్యక్రమంలో భారత్‌లో ఆస్ట్రేలియా రాయబారి ప్యాట్రిక్ సక్లింగ్, దక్షిణ భారత రాయబారి సీన్ కెల్లి తదితర్లు పాల్గొన్నారు.