చంద్రబాబు సహా ఐదుగురు ఏపీ మంత్రులపై కేసు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో పాటు ఏపీకి చెందిన నలుగురు మంత్రులు, ఒక ఎంఎల్‌ఏపై కేసు నమోదు చేయాలని రంగారెడ్డి కోర్టు ఎల్‌బి నగర్ పోలీసులను ఆదేశించింది. చంద్రబాబుతో పాటు ఐదుగురిపై ఐపీసీ సెక్షన్ 124, 124 ఎ, 141, 146, 153ఎ, 181, 504, 506 రెడ్ విత్ 120 బి సెక్షన్ల కింద కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబుతో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, రావెల […]
BY Pragnadhar Reddy26 Jun 2015 3:03 AM IST
X
Pragnadhar Reddy Updated On: 26 Jun 2015 3:03 AM IST
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో పాటు ఏపీకి చెందిన నలుగురు మంత్రులు, ఒక ఎంఎల్‌ఏపై కేసు నమోదు చేయాలని రంగారెడ్డి కోర్టు ఎల్‌బి నగర్ పోలీసులను ఆదేశించింది. చంద్రబాబుతో పాటు ఐదుగురిపై ఐపీసీ సెక్షన్ 124, 124 ఎ, 141, 146, 153ఎ, 181, 504, 506 రెడ్ విత్ 120 బి సెక్షన్ల కింద కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబుతో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, రావెల కిషోర్ బాబు, పత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర చౌదరి రాష్ట్ర గవర్నర్ ఈ ఎస్ఎల్ నరసింహన్‌ను తిట్టడంతో పాటు బెదిరించారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాది ములుగాని ఫణీంద్ర భార్గవ్ రంగారెడ్డి జిల్లా రెండో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదేగాక 500 మంది ఆంధ్ర ప్రదేశ్ పోలీసులను తెలంగాణకు రప్పించడం ఇక్కడి పోలీసుల స్థైర్యాన్ని దెబ్బతీయడమేనని, ప్రజలు రెచ్చిపోయే విధంగా వారు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను న్యాయమూర్తి యూసుఫ్ విచారించి వారిపై ఎఫ్‌ఐ ఆర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించారు.
Next Story