Telugu Global
Others

విద్యుత్ ఆస్తులు పంచుకుందాం

ఆంధ్ర్ర ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య విద్యుత్ ఆస్తుల పంప‌కాల‌పై చ‌ర్చించేందుకు ఈనెల 29న స‌మావేశ‌మ‌వుదామ‌ని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కోల సీఎండి ప్ర‌భాక‌ర‌రావు, ఏపీ జెన్‌కో ఎండీ విజ‌యానంద్‌కు లేఖ రాశారు. రెండు రాష్ట్రాల మ‌ధ్య విద్యుత్ ఉద్యోగుల పంప‌కాల‌పై ఇప్ప‌టికే వివాదం త‌లెత్తింది. తెలంగాణ విద్యుత్ సంస్థ‌ల నుంచి ఏపీ స్థానిక‌త గ‌ల ఉద్యోగుల‌ను రిలీవ్ చేయ‌డంపై ఇప్ప‌టికే హైకోర్టులో విచార‌ణ జ‌రుగుతోంది. దీంతో ఇప్ప‌ట్లో చేసేదేమీ లేద‌ని తెలంగాణ విద్యుత్ సంస్థ‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి. […]

ఆంధ్ర్ర ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య విద్యుత్ ఆస్తుల పంప‌కాల‌పై చ‌ర్చించేందుకు ఈనెల 29న స‌మావేశ‌మ‌వుదామ‌ని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కోల సీఎండి ప్ర‌భాక‌ర‌రావు, ఏపీ జెన్‌కో ఎండీ విజ‌యానంద్‌కు లేఖ రాశారు. రెండు రాష్ట్రాల మ‌ధ్య విద్యుత్ ఉద్యోగుల పంప‌కాల‌పై ఇప్ప‌టికే వివాదం త‌లెత్తింది. తెలంగాణ విద్యుత్ సంస్థ‌ల నుంచి ఏపీ స్థానిక‌త గ‌ల ఉద్యోగుల‌ను రిలీవ్ చేయ‌డంపై ఇప్ప‌టికే హైకోర్టులో విచార‌ణ జ‌రుగుతోంది. దీంతో ఇప్ప‌ట్లో చేసేదేమీ లేద‌ని తెలంగాణ విద్యుత్ సంస్థ‌లు స్ప‌ష్టం చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈనెల 29న విద్యుత్ ఆస్తుల పంప‌కానికి ఏపీ జెన్‌కో ఎండీకి తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ లేఖ రాయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

First Published:  25 Jun 2015 6:43 PM IST
Next Story