పాపం కాకతీయుడు అయిన ఆదుకుంటుందా..?
అదేంటో గాని కొందరికి హీరో కావడానికి లెక్కలు కొలతలు అన్ని పరఫెక్ట్ గా వున్న గానీ హీరోగా మాత్రం రాణించలేక పోతుంటారు. ఆ కేటగిరి లో చెప్పుకోవాలంటే.. తారకరత్న మొదటి ప్లేస్ లో వుంటారు. ఆయన పర్సనాలిటి.. ఒక స్టార్ హీరో కావడానికి సరిపోతుంది. నందమూరి ఎన్టీఆర్ మనవడు. ఒకటో నెంబర్ కుర్రాడో అంటూ వచ్చాడు ..మెప్పించాడు. అయితే హీరో గా ఒక్కొ మెట్టు ఎక్కాల్సింది పోయి.. తారకరత్న విషయంలో రివర్స్ గేర్ పడింది. కెరీర్ లో […]
అదేంటో గాని కొందరికి హీరో కావడానికి లెక్కలు కొలతలు అన్ని పరఫెక్ట్ గా వున్న గానీ హీరోగా మాత్రం రాణించలేక పోతుంటారు. ఆ కేటగిరి లో చెప్పుకోవాలంటే.. తారకరత్న మొదటి ప్లేస్ లో వుంటారు. ఆయన పర్సనాలిటి.. ఒక స్టార్ హీరో కావడానికి సరిపోతుంది. నందమూరి ఎన్టీఆర్ మనవడు. ఒకటో నెంబర్ కుర్రాడో అంటూ వచ్చాడు ..మెప్పించాడు. అయితే హీరో గా ఒక్కొ మెట్టు ఎక్కాల్సింది పోయి.. తారకరత్న విషయంలో రివర్స్ గేర్ పడింది. కెరీర్ లో చెప్పుకోవడానికి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ లేదు. గుడ్డిలో మెల్ల అన్నట్లు చెప్పుకోవాలంటే.. డెబ్యూ సినిమా ఒకటో నెంబర్ కుర్రాడో ఇప్పటి వరకు ఆయన చేసిన చిత్రాల్లో బెటర్. కట్ చేస్తే .. చేయడానికి నెంబర్ ఆఫ్ ఫిల్మ్ చాల వున్నాయి. చిన్న నిర్మాతలకు పెద్ద హీరో అయ్యాడు. అయితే తన ఎనర్జీని.. తన పర్సనాలిటిని ఉపయోగించుకునే దర్శకుడు ఇప్పటి వరుకు ఆయనతో చేసిన దర్శకుల్లో ఒక్కరు లేరు.
ఫ్యామిలి సైడ్ నుంచి కూడా సరైన సపోర్ట్ ఉన్నట్లు అనిపించదు. తాజాగా సీనియర్ డైరెక్టర్ సముద్ర తో కాకతీయుడు అనే చిత్రం చేశాడు.ఈ సినిమా ఆడియో విడుదల జరిగింది. సముద్ర చిత్రాలు ఇప్పటి జనరేషన్ ను అకట్టుకోలేవు. ఎప్పుడో 1980 తరహాలో చేస్తుంటాడు. అపడేట్ వుండదు పాడు వుండదు. మరి ఇటువంటి డైరెక్టర్ తో ఏదో లక్ కుదిరితే తప్ప.. తారకరత్న కు బ్రేక్ రావడం కష్టం. సినిమా లెక్కల ప్రకారం ప్రస్తుతం అతనికున్న మార్కెట్ కు పెద్ద దర్శకుడు..పెద్ద ప్రాజెక్ట్ లు చేయడానికి ఎవరు ముందుకు రారు. మరి తారకరత్న కు ఎప్పటికి బ్రేక్ ఎప్పటికి వస్తుందో..? అది దేవుడికే తెలియాలి.