Telugu Global
NEWS

అవన్నీ ఒరిజ‌న‌ల్ టేపులే: ఎఫ్ఎస్ఎల్‌

ఓటుకు నోటు కేసులో కీలకమైన ఆడియో, వీడియో టేపులలో అతుకులేవీ లేవని ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ (ఎఫ్‌ఎ్‌సఎల్) అధికారులు ఏసీబీ కోర్టుకు సమర్పించిన ప్రాథమిక నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ మేరకు బుధవారం సీల్డ్‌ కవర్‌లో నివేదికను న్యాయస్థానానికి అందజేశారు. ‘‘టేపుల్లో కట్‌ అండ్‌ పేస్ట్‌ లేదు. ఒరిజినల్‌ టేపులే’’నని ప్రస్తుత పరిశీలనలో తేలినట్లు అందులో వివరించారని తెలిసింది. టేపుల్లో నమోదైన వాయిస్‌లో వాస్తవికతను శాస్త్రీయంగా తేల్చాలని ఆదేశిస్తూ 14 టేపులు, ఐఫోన్‌, ఇతర పరికరాల్ని న్యాయస్థానం […]

అవన్నీ ఒరిజ‌న‌ల్ టేపులే: ఎఫ్ఎస్ఎల్‌
X
ఓటుకు నోటు కేసులో కీలకమైన ఆడియో, వీడియో టేపులలో అతుకులేవీ లేవని ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబొరేటరీ (ఎఫ్‌ఎ్‌సఎల్) అధికారులు ఏసీబీ కోర్టుకు సమర్పించిన ప్రాథమిక నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ మేరకు బుధవారం సీల్డ్‌ కవర్‌లో నివేదికను న్యాయస్థానానికి అందజేశారు. ‘‘టేపుల్లో కట్‌ అండ్‌ పేస్ట్‌ లేదు. ఒరిజినల్‌ టేపులే’’నని ప్రస్తుత పరిశీలనలో తేలినట్లు అందులో వివరించారని తెలిసింది. టేపుల్లో నమోదైన వాయిస్‌లో వాస్తవికతను శాస్త్రీయంగా తేల్చాలని ఆదేశిస్తూ 14 టేపులు, ఐఫోన్‌, ఇతర పరికరాల్ని న్యాయస్థానం ఎఫ్ఎస్‌ఎల్‌కు పంపింది. టేపుల్ని దశలవారిగా పరిశీలించిన అధికారులు అందులో అతుకులు లేవని ప్రాథమికంగా నిర్ధారించారు. పూర్తిస్థాయి నివేదిక తయారీకి మరికొంత సమయం పడుతుంది. ఈలోగా అవసరమైతే కోర్టు అనుమతితో టేపుల్లోని వ్యక్తుల స్వర నమూనాలను నేరుగా సేకరించే అవకాశం లేకపోలేదు. కాగా, ఈ కేసులో వారంనుంచీ ఏసీబీ దర్యాప్తులో స్తబ్దత నెలకొంది. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి వేం నరేందర్‌రెడ్డిని అధికారులు విచారించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు నోటీసులు జారీచేసినా… అనారోగ్యం కారణం చెప్పి ఆయన త‌ప్పించుకు తిరుగుతున్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్‌ ప్రాథమిక నివేదిక కోర్టుకు అందిన నేపథ్యంలో నేడోరేపో మెమో దాఖలుచేసి నివేదికను తీసుకునే అవకాశం ఉంది. హైకోర్టులో రేవంత్‌ బెయిల్‌ పిటిషన్‌ అడ్డుకోవడంతోపాటు తదుపరి దర్యాప్తునకు ఈ నివేదికను వినియోగించుకునే అవకాశాలున్నాయి.
First Published:  25 Jun 2015 6:01 AM IST
Next Story