ప్రపంచంతో పోటీ పడదాం... భారత్‌ను ఆధునీకరిద్దాం
చారిత్రాత్మక 3 పథకాలకు నరేంద్ర మోడి శ్రీకారం ప్రధానమంత్రి నరేంద్రమోడి మానస పుత్రికలుగా భాసిల్లుతున్న మూడు పథకాలకు గురువారం శ్రీకారం చుట్టారు. విజ్ఞాన భవన్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నఅటల్ పట్టణ నవీకరణ (అమృత్), ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అందరికీ గృహాలు), స్మార్ట్‌సిటీస్ పథకాలను ఆయన ప్రారంభించారు. ఈ మూడు పథకాలకు మొత్తం నాలుగు లక్షల కోట్లు వెచ్చించనున్నట్టు మోడీ తెలిపారు. గత అనుభవాలు చేదుగా ఉన్నా వాటిని తలుచుకుని దిగులు పడాల్సిన […]
BY sarvi25 Jun 2015 6:45 AM IST
X
sarvi Updated On: 25 Jun 2015 8:57 AM IST
చారిత్రాత్మక 3 పథకాలకు నరేంద్ర మోడి శ్రీకారం
ప్రధానమంత్రి నరేంద్రమోడి మానస పుత్రికలుగా భాసిల్లుతున్న మూడు పథకాలకు గురువారం శ్రీకారం చుట్టారు. విజ్ఞాన భవన్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నఅటల్ పట్టణ నవీకరణ (అమృత్), ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అందరికీ గృహాలు), స్మార్ట్‌సిటీస్ పథకాలను ఆయన ప్రారంభించారు. ఈ మూడు పథకాలకు మొత్తం నాలుగు లక్షల కోట్లు వెచ్చించనున్నట్టు మోడీ తెలిపారు. గత అనుభవాలు చేదుగా ఉన్నా వాటిని తలుచుకుని దిగులు పడాల్సిన పని లేదని, భవిష్యత్ అంతా ముందుందని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఆయన కోరారు. ప్రపంచ దేశాలతో పోటీ పడగలమా అనే సందేహాలు వద్దని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
దేశంలోని వంద నగరాలను స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం 48 వేల కోట్లను ఖర్చు చేయనున్నామని ఆయన చెప్పారు. అమృత్ పథకం కింద 50 వేల కోట్లతో 500 నగరాలకు సందర రూపం ఇవ్వనున్నామని తెలిపారు. ఈ పథకం కింద ఎంపికైన ఒక్కో నగరానికి యేడాదికి రూ. 100 కోట్లు కేటాయిస్తారు. ఇలా ఐదేళ్ళపాటు నిధులు సమకూరుతాయని ఆయన చెప్పారు. జూన్ 25, 26 తేదీలను జీవితంలో మరిచిపోలేని విధంగా మారుస్తామని ప్రధాని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు, స్థానిక సంస్థలు కలిసి సమిష్టిగా ఈ పథకాలను విజయవంతం చేయాలని ప్రధాని మోడీ కోరారు.
పట్టణ జీవన విధానంలో మార్పులు తేవాలన్నది తమ ప్రభుత్వ ఉద్దేశ్యమని ఆయన చెప్పారు. ఉపాధి కోసం వలస వెళ్లిపోతున్న ప్రజల జీవితాలను మనం చూస్తున్నామని, దీనివల్ల పట్టణీకరణ పెరుగుతందని… గ్రామాలకు ఆదరణ లేకుండా పోతుందని, ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా మనపైన ఉందని ప్రధాని చెప్పారు. పట్టణ జీవన విధానంలో మార్పులు తేవాలన్నదే ప్రభుత్వ సంకల్పమని, అందరం కలిసి చర్చించి ఈ పరిస్థిని మార్చే కార్యక్రమాలకు తుది రూపం ఇవ్వాలని ప్రధాని ఆకాంక్షించారు. సొంత ఇళ్ళు కట్టుకునే వారికి అండగా ఉండాలని, సామాన్యుడికి కావాల్సిన కనీస అవసరాలను తీర్చాల్సి ఉందని ఆయన అన్నారు. నగరాల్లో ఇంకా రెండు కోట్ల మందికి నివాస యోగ్యం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయివేటు వ్యక్తులు నిర్మాణ రంగంలో ఉన్నా వారు ఇళ్ళు నిర్మిస్తున్నారు కాని సరైన వసతులు కల్పించడం లేదు. దీన్ని ప్రభుత్వ పథకాల్లో సవరించాలని ఆయన అన్నారు. స్వతంత్ర భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాల్సిన అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు. సామాన్యుడికి కావాల్సిన కనీస అవసరాలను తీర్చాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉందని ఆయన అన్నారు.68 యేళ్ళ స్వతంత్ర భారతంలో ఇంకా మురికివాడల్లోను, పుట్‌పాత్‌ల మీద నివాసం ఉండడం చాలా బాధాకరమని, ఈ పరిస్థితిని మార్చాల్సి ఉందని ప్రధాని అన్నారు.
పన్నుల వసూళ్ళలో హైదరాబాద్ ఆదర్శం
తెలుగు రాష్ట్రాల్లో ఐదు స్మార్ట్ సిటీలు, అమృత్ పథకానికి 46 పట్టణాలు ఎంపిక చేశారు. స్మార్ట్ సిటీల కింద తెలంగాణలో రెండు, ఆంద్రప్రదేశ్‌లో మూడు ఎంపిక చేసినట్టు చెప్పారు. అలాగే అటల్ పట్టణ నవీకరణ పథకం కింద తెలంగాణలో 15, ఆంద్రప్రదేశ్‌లో 31 పట్టణాలు ఎంపిక చేసినట్టు ఆయన చెప్పారు. హైదరాబాద్‌లో పన్నుల విధానం ఎంతో బాగుంది… అక్కడ అద్భుతంగా పన్నులు వసూలవుతున్నాయి. ఇలా మిగిలిన నగరాల్లో ఎందుకు జరగడం లేదు అని ఆయన ప్రశ్నించారు. బెంగుళూరులో వ్యర్థాల నిర్వహణ చాలా పకడ్బందీగా జరుగుతోంది.. మిగిలిన చోట్ల ఇదెందుకు సాధ్యం కావడం లేదు… విధానాల పట్ల, చేసే పని పట్ల చిత్తశుద్ధి ఉంటే అనుకున్నవన్నీ నెరవేరతాయని ఆయన అన్నారు. ఇలాంటి నగరాలు మిగిలిన వాటికి ఆదర్శం. ఇలాంటి మేలైన విధానాలు అనుసరిస్తున్న నగరాలపై ఉమ్మడిగా చర్చ జరగాలి… అభివృద్ధికి మార్గదర్శకాలుగా వీటిని మనం స్వీకరించాలి అని మోడీ పిలుపు ఇచ్చారు.
Next Story