సెక్షన్-8పై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు: సదానంద గౌడ
సెక్షన్-8పై రెండు రాష్ర్టాల మధ్య చిచ్చురేగడంతో ఎట్టకేలకు కేంద్రం దీనిపై స్పందించింది. ఈ విషయంలో గవర్నర్‌కు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని కేంద్రమంత్రి సదానందగౌడ గురువారం స్పష్టం చేశారు. దీంతో కొన్నిరోజులుగా కొన్ని మీడియాలో వస్తున్న ప్రచారాలన్నీ అవాస్తవమని తేలిపోయింది. సెక్షన్-8 అమలు చేయాలని గవర్నర్ కు ఏజీ లేఖరాశారంటూ కొన్ని మీడియాలో వచ్చిన కథనాలు కలకలానికి కారణమయ్యాయి. అలాంటిదేం జరగలేదని బుధవారం కేంద్రం స్పష్టం చేసింది. తాజాగా కేంద్రమంత్రి సదానంద గౌడ ప్రకటనతో అవన్నీ వదంతులేనని తేలిపోయాయి. […]
BY Pragnadhar Reddy25 Jun 2015 5:07 AM IST
X
Pragnadhar Reddy Updated On: 25 Jun 2015 7:40 AM IST
సెక్షన్-8పై రెండు రాష్ర్టాల మధ్య చిచ్చురేగడంతో ఎట్టకేలకు కేంద్రం దీనిపై స్పందించింది. ఈ విషయంలో గవర్నర్‌కు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని కేంద్రమంత్రి సదానందగౌడ గురువారం స్పష్టం చేశారు. దీంతో కొన్నిరోజులుగా కొన్ని మీడియాలో వస్తున్న ప్రచారాలన్నీ అవాస్తవమని తేలిపోయింది. సెక్షన్-8 అమలు చేయాలని గవర్నర్ కు ఏజీ లేఖరాశారంటూ కొన్ని మీడియాలో వచ్చిన కథనాలు కలకలానికి కారణమయ్యాయి. అలాంటిదేం జరగలేదని బుధవారం కేంద్రం స్పష్టం చేసింది. తాజాగా కేంద్రమంత్రి సదానంద గౌడ ప్రకటనతో అవన్నీ వదంతులేనని తేలిపోయాయి. ఓటుకు నోటు కేసులో తమ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రూ.50 లక్షలు లంచం ఇస్తూ పట్టుబడటంతో టీడీపీకి ఏంచేయాలో పాలుపోలేదు. విషయాన్ని పక్కదారి పట్టించేందుకు సెక్షన్ -8 అమలు చేయాలంటూ.. గవర్నర్ పై ముప్పేట దాడి చేస్తూ వస్తోంది. కేంద్రంపై ఒత్తిడి తేలేక ఉమ్మడి గవర్నర్‌పై ఇంతకాలం మాటల యుద్ధం కొనసాగిస్తూ వచ్చింది.. ఇకపై ఆ ఆటలు కూడా సాగేలా లేకపోవడంతో టీడీపీ దిక్కుతోచని పరిస్థితుల్లో చిక్కుకుపోయినట్లయింది.
Next Story