రెండు నెలల పాటు ఎన్టీఆర్ పరార్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మనకిక కనిపించడు. అవును..యంగ్ టైగర్ మరో 5 రోజుల్లో మాయంకాబోతున్నాడు. ఇదంతా సుకుమార్ సినిమా కోసమే. దర్శకుడు సుకుమార్ కోసం యంగ్ టైగర్ కాల్షీట్లు అన్నీ ఇచ్చేశాడు. గ్యాప్ లేకుండా సుకుమార్ తోనే సెట్స్ లో గడిపేందుకు ఫిక్స్ అయ్యాడు. ఏకంగా జులై 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు సుక్కూ సినిమాకు డేట్స్ ఇచ్చాడు. ఒక సినిమాకు ఏకథాటిగా 75 రోజుల పాటు యంగ్ టైగర్ డేట్స్ కేటాయించడం ఇదే ప్రధమం. […]
BY admin25 Jun 2015 1:32 AM IST
X
admin Updated On: 25 Jun 2015 7:52 AM IST
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మనకిక కనిపించడు. అవును..యంగ్ టైగర్ మరో 5 రోజుల్లో మాయంకాబోతున్నాడు. ఇదంతా సుకుమార్ సినిమా కోసమే. దర్శకుడు సుకుమార్ కోసం యంగ్ టైగర్ కాల్షీట్లు అన్నీ ఇచ్చేశాడు. గ్యాప్ లేకుండా సుకుమార్ తోనే సెట్స్ లో గడిపేందుకు ఫిక్స్ అయ్యాడు. ఏకంగా జులై 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు సుక్కూ సినిమాకు డేట్స్ ఇచ్చాడు. ఒక సినిమాకు ఏకథాటిగా 75 రోజుల పాటు యంగ్ టైగర్ డేట్స్ కేటాయించడం ఇదే ప్రధమం. ఏమాత్రం టెంపో మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు ఎన్టీఆర్. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. దాదాపు ఈ 2 నెలల షూటింగ్ లండన్ లోనే ప్లాన్ చేశారు. సినిమాలో 70శాతం టాకీతో పాటు కొన్ని పాటల్ని కూడా లండన్ లోనే తీయాలని ఫిక్స్ చేశారు. ఆ మేరకు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు కూడా సమాచారం అందించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, ఎన్టీఆర్ కు తండ్రిగా నటించబోతున్నాడు. మరో కీలకపాత్రలో జగపతిబాబు కూడా కనిపిస్తాడు. సినిమా యాక్షన్ మూవీనా, ఫ్యామిలీ ఎంటర్ టైనరా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story