Telugu Global
Others

తాగి డ్రైవ్ చేస్తే ఇక ప‌ది వేలు ఫైన్‌!

డ్రంకన్ డ్రైవ్ కేసులో పట్టుబడితే ఇకపై ప‌ది వేలు ఫైన్ క‌ట్టాల్సి ఉంటుంది. మద్యం తాగి వాహనం నడుపుతూ మొదటిసారి పట్టుబడివారికి జరిమానా అయిదు రెట్లు ఎక్కువగా విధించాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. రెండో సారీ అదే తప్పు చేస్తే 10 వేల రూపాయల జరిమానా, ఆరు నెలలనుంచి ఏడాది జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. పైగా సవత్సరంపాటు వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకుంటారు. ఈ మంత్రిత్వ శాఖ విధించబోతున్న నిబంధనల్లో […]

డ్రంకన్ డ్రైవ్ కేసులో పట్టుబడితే ఇకపై ప‌ది వేలు ఫైన్ క‌ట్టాల్సి ఉంటుంది. మద్యం తాగి వాహనం నడుపుతూ మొదటిసారి పట్టుబడివారికి జరిమానా అయిదు రెట్లు ఎక్కువగా విధించాలని కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ యోచిస్తోంది. రెండో సారీ అదే తప్పు చేస్తే 10 వేల రూపాయల జరిమానా, ఆరు నెలలనుంచి ఏడాది జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. పైగా సవత్సరంపాటు వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకుంటారు. ఈ మంత్రిత్వ శాఖ విధించబోతున్న నిబంధనల్లో ఇవి కొన్ని మాత్రమే. ఈ రూల్స్‌కు సంబంధించిన బిల్లు చట్టంగా మారితే ఇవన్నీ అమలులోకి వస్తాయి. తన తాజా బిల్లు కాపీలను ఈ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ పంపింది. ప్రస్తుతం మొదటిసారి పట్టుబడిన వారికి రెండువేల రూపాయల వరకూ జరిమానా విధిస్తున్నారు. ఇక ఇన్సూర్ చేయని వాహనానికి దాని టైప్‌ను బట్టి రెండువేల నుంచి లక్ష వరకు, వెహికల్ డిజైన్‌లో లోపాలుంటే అయిదు లక్షల వరకు ఫైన్ విధించే అవకాశం ఉంది.
First Published:  24 Jun 2015 6:38 PM IST
Next Story