నెల్లూరు వైసీపీలో మేకపాటి x నల్లపురెడ్డి విభేదాలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలను నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఖండించారు. పార్టీకి రాజీనామా చేసే ప్రసక్తే లేదని, చివరి వరకు జగన్ వెంటే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. తాను పార్టీకి రాజీనామా చేసి ఆ లేఖను జగన్‌కు ఫ్యాక్స్ చేసినట్లు కొన్ని చానల్సల్‌లో ప్రచారం జరగడంతో ఆయన వివరణ ఇచ్చారు. జగన్ తనను తిట్టినట్టు అందుకే తాను రాజీనామా చేసినట్టు ఒక చానెల్‌లో వార్తలు రావడంపై […]
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలను నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఖండించారు. పార్టీకి రాజీనామా చేసే ప్రసక్తే లేదని, చివరి వరకు జగన్ వెంటే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. తాను పార్టీకి రాజీనామా చేసి ఆ లేఖను జగన్‌కు ఫ్యాక్స్ చేసినట్లు కొన్ని చానల్సల్‌లో ప్రచారం జరగడంతో ఆయన వివరణ ఇచ్చారు. జగన్ తనను తిట్టినట్టు అందుకే తాను రాజీనామా చేసినట్టు ఒక చానెల్‌లో వార్తలు రావడంపై ప్రసన్న మండిపడ్డారు. జగన్ తనను ఎప్పుడూ తిట్టలేదని అలాంటి అసత్య ప్రచారాలకు ఎందుకు దిగుతున్నారో అర్ధం కావడం లేదని ఆయన అన్నారు. అయితే నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని లుకలుకలను ఈ వ్యవహారం మరోమారు బట్టబయలు చేసింది. ప్రసన్నకుమార్‌రెడ్డికి మేకపాటి సోదరులకు మధ్య పొసగడం లేదన్నది బహిరంగ రహస్యమే. రెండు శిబిరాలూ ఎవరి దారి వారిది అన్నట్లుగా జిల్లాలో కార్యక్రమాలు నడుస్తుంటాయి. మేకపాటి సోదరులు, ప్రసన్న ఒక వేదికపై ఎప్పుడూ కనిపించిందే లేదు. జిల్లాలో పట్టు కోసం వారి మధ్య ఎప్పుడూ పోరు పరోక్షంగా కొనసాగుతూనే ఉంది. అయితే అది ప్రసన్న రాజీనామా చేసేంత స్థాయిలో మాత్రం లేదు. ఎన్ని విభేదాలున్నా బేధాభిప్రాయాలున్నా ఎవరి మానాన వారు పని చేసుకుంటూ పోతున్నారు. ఈ మధ్య ఓ వివాదం చిలికి చిలికి గాలివానగా మారి చివరకు జగన్ వద్దకు చేరిందని, గొడవలు మాని ఇరుపక్షాలూ కలసి జిల్లాలో పార్టీ అభివృద్ధిపై దృష్టిపెట్టాలని రెండు శిబిరాలకు ఆయన కాస్త గట్టిగానే చెప్పారని వినిపిస్తోంది. ఇపుడు ప్రసన్న వివరణతో నెల్లూరు వివాదం సద్దుమణిగినట్లుగానే భావించాల్సి ఉంటుంది.