కేసీఆర్ పాలనపై టీ-కాంగ్రెస్ ధ్వజం
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రభుత్వ విధానాలను టి-ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తూర్పారబట్టారు. కల్లబొల్లి హామీలతో ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్ ఆ తర్వాత ప్రజలకు శూన్య హస్తం చూపించారని ఆయన ఆరోపించారు. గురువారం హన్మకొండ కాంగ్రెస్ భవనలో పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ మాదిగలకు ఆయన అన్యాయం చేస్తున్నారని, మాదిగ మహిళలకు కేబినెట్‌లో స్థానం ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల హామీల్లో […]
BY sarvi25 Jun 2015 6:07 AM GMT
X
sarvi Updated On: 25 Jun 2015 6:07 AM GMT
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ప్రభుత్వ విధానాలను టి-ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తూర్పారబట్టారు. కల్లబొల్లి హామీలతో ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్ ఆ తర్వాత ప్రజలకు శూన్య హస్తం చూపించారని ఆయన ఆరోపించారు. గురువారం హన్మకొండ కాంగ్రెస్ భవనలో పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ మాదిగలకు ఆయన అన్యాయం చేస్తున్నారని, మాదిగ మహిళలకు కేబినెట్‌లో స్థానం ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల హామీల్లో ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్ ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. అన్ని వర్గాలకు ఆయన అన్యాయం చేస్తూ పదవిలో కొనసాగుతున్నారని, సామాజిక తెలంగాణ అన్న కేసీఆర్ కుటుంబ తెలంగాణగా మార్చేశారని తప్పు పట్టారు. తెలంగాణలో ఏడాది కాలంగా ఒక ఛానల్‌ను నిషేధిస్తే స్పందించని కొందరు నేతలు టీన్యూస్‌కు నోటీసులిస్తే మాత్రం గొంతు చించుకుని రెచ్చిపోతున్నారని ఆయన విమర్శించారు. టీ-ఛానల్‌కు నోటీసులివ్వడం రాజ్యాంగానికి ఏదో ఉపద్రవం కలిగినట్టు గగ్గొలు పెడుతున్నారని మండిపడ్డారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం మీడియాపై పెత్తనం చేయాలని చూస్తోందని ఆయన అన్నారు. రాజ్యాంగ పరిధిలో కేసీఆర్ పాలన సాగించడం లేదని ఉత్తమ్ అన్నారు.
ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కే ప్రజలు పట్టం కడతారని మాజీ మంత్రి బసవరాజు సారయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు పూర్వ వైభవం వరంగల్ నుంచే మొదలవుతుందన్నారు. తెలంగాణ తెచ్చింది…ఇచ్చింది కాంగ్రెస్ పార్టే అని సారయ్య మరోసారి స్పష్టం చేశారు. కేసీఆర్‌పాలనను ఎండగట్టిన గెలిపించిన ప్రజలకు కేసీఆర్ శూన్య హస్తం చూపించారని మరో నేత సర్వే సత్యనారాయణ అన్నారు. కేసీఆర్ మాదిగలకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని, వరంగల్ ఉప ఎన్నికల్లో ఆరు లక్షల మెజారిటీతో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని సర్వే అన్నారు.
Next Story