బిందుమాధవికి బంపర్ ఆఫర్!
తెలుగు హీరోయిన్ బిందుమాధవికి హీరో విక్రమ్ సరసన రెండో హీరోయిన్‌గా నటించే అవకాశం లభించింది. ఇది నిజంగా ఆమెకు బంపరాఫరే. తెలుగులో ‘ఆవకాయ బిర్యాని’ మూవీతో పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత రామరామ కృష్ణ కృష్ణ, పిల్ల జమిందార్ వంటి చిత్రాలు చేసినా ఆశించిన ఇమేజ్ రాలేదు. ఇక్కడ లాభం లేదని కోలీవుడ్‌కి వెళ్లింది. అక్కడ వరుస హిట్స్ కొట్టింది. లేటెస్ట్‌గా అరిమ నంబి డైరెక్టర్ ఆనంద్ శంకర్ డైరెక్షన్‌లో విక్రమ్ హీరోగా చేస్తున్న మూవీలో […]
BY admin25 Jun 2015 12:30 AM IST

X
admin Updated On: 25 Jun 2015 7:56 AM IST
తెలుగు హీరోయిన్ బిందుమాధవికి హీరో విక్రమ్ సరసన రెండో హీరోయిన్‌గా నటించే అవకాశం లభించింది. ఇది నిజంగా ఆమెకు బంపరాఫరే. తెలుగులో ‘ఆవకాయ బిర్యాని’ మూవీతో పరిచయమైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత రామరామ కృష్ణ కృష్ణ, పిల్ల జమిందార్ వంటి చిత్రాలు చేసినా ఆశించిన ఇమేజ్ రాలేదు. ఇక్కడ లాభం లేదని కోలీవుడ్‌కి వెళ్లింది. అక్కడ వరుస హిట్స్ కొట్టింది. లేటెస్ట్‌గా అరిమ నంబి డైరెక్టర్ ఆనంద్ శంకర్ డైరెక్షన్‌లో విక్రమ్ హీరోగా చేస్తున్న మూవీలో సెకండ్ హీరోయిన్‌గా బిందు చాన్స్ దక్కించుకుంది. ఫస్ట్ హీరోయిన్‌గా కాజల్ చేస్తున్న ఇందులో మరో హీరోయిన్‌ని ఎవరిని తీసుకోవాలా అని దర్శకుడు తర్జనభర్జన పడ్డాడు. చివరకు ప్రియాఆనంద్ పేరు బయటకు వచ్చినా, ఫైనల్‌గా ఈ ఆఫర్ బిందుమాధవిని వరించింది. ఈ మూవీతో అయినా మదనపల్లి అమ్మాయికి టాలీవుడ్‌లో మరిన్ని ఆఫర్స్ వస్తాయేమో చూడాలి.
Next Story