పుష్కర పనుల్లో మంచి పనితీరుకు అవార్డులు : చంద్రబాబు
గోదావరి పుష్కర పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఈ పనులపై చంద్రబాబు గురువారం రాజమండ్రిలో ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతంలో పుష్కర పనులు సకాలంలో పూర్తి అయ్యాయని, ఈసారి ఆలస్యం అవుతున్నాయని ఆయన అన్నారు. అధికారులు దగ్గర ఉండి పుష్కర పనులు పర్యవేక్షిస్తూ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పుష్కర పనుల్లో మంచి పనితీరు కనబరిస్తే అవార్డులు ఇస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఫైబర్ వైర్లు ఏర్పాటు చేసి, […]
BY sarvi25 Jun 2015 12:36 PM IST
X
sarvi Updated On: 25 Jun 2015 12:36 PM IST
గోదావరి పుష్కర పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఈ పనులపై చంద్రబాబు గురువారం రాజమండ్రిలో ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతంలో పుష్కర పనులు సకాలంలో పూర్తి అయ్యాయని, ఈసారి ఆలస్యం అవుతున్నాయని ఆయన అన్నారు. అధికారులు దగ్గర ఉండి పుష్కర పనులు పర్యవేక్షిస్తూ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. పుష్కర పనుల్లో మంచి పనితీరు కనబరిస్తే అవార్డులు ఇస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఫైబర్ వైర్లు ఏర్పాటు చేసి, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని ఆయన సూచించారు. ఘాట్‌ల వద్ద నీరు కాలుష్యం కాకుండా జాగ్రత్త వహించాలని బాబు సూచించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్సులు, రైళ్లు ఏర్పాటు చేయాలని చంద్రబాబు ఆయా సంస్థలకు సూచించారు. భక్తుల రాకపోకలను బట్టి బస్సులు పెంచేది, తగ్గించేది చూసుకోవాలని ఆయన అన్నారు. ఇరిగేషన్, పంచాయితీరాజ్, ఎండోమెంట్, ఏపీపీడీసీఎల్, మున్సిపల్ కార్పొరేషన్, సెక్యూరిటీ… ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, ఆర్టీసీ, రైల్వే, మెడికల్, హెల్త్, ఫైర్ సర్వీస్, టూరిజం, కల్చర్ తదితర సంస్థల అధికారులతో చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. మిగిలిన పనులన్నీ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని నొక్కి చెప్పారు.
Next Story