Telugu Global
Others

షాపింగ్ మాల్స్ మ‌ద్యానికి ష‌ర‌తులు

నూత‌న మ‌ద్య విధానంలో  ప‌దిశాతం మ‌ద్యం దుకాణాలు  ప్ర‌భుత్వ ఆధీనంలోనే న‌డ‌పాల‌ని  ఏపీ ప్ర‌భుత్వం  నిర్ణ‌యం తీసుకుంది. అందులో భాగంగా స‌హ‌కార సంఘాల్లోనూ, ప్ర‌భుత్వ  కార్పోరేష‌న్లలోనూ  ఆ ప‌ది శాతం మ‌ద్యం దుకాణాల‌ను  ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది.ఈ  మ‌ద్యం దుకాణాల‌కు ఫీజు ఉండ‌దు. మ‌ద్యం విక్ర‌యాల్లో కొంత శాతాన్ని ప్ర‌భుత్వం ఫీజుగా వ‌సూలు చేస్తుంది. నూత‌న మ‌ద్యం విధానం ద్వారా షాపింగ్ మాల్స్‌లో మ‌ద్యం విక్ర‌యానికి అనుమ‌తించిన ప్ర‌భుత్వం దీనిపై కొన్ని ష‌ర‌తులు విధించింది. ప‌ది […]

నూత‌న మ‌ద్య విధానంలో ప‌దిశాతం మ‌ద్యం దుకాణాలు ప్ర‌భుత్వ ఆధీనంలోనే న‌డ‌పాల‌ని ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అందులో భాగంగా స‌హ‌కార సంఘాల్లోనూ, ప్ర‌భుత్వ కార్పోరేష‌న్లలోనూ ఆ ప‌ది శాతం మ‌ద్యం దుకాణాల‌ను ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది.ఈ మ‌ద్యం దుకాణాల‌కు ఫీజు ఉండ‌దు. మ‌ద్యం విక్ర‌యాల్లో కొంత శాతాన్ని ప్ర‌భుత్వం ఫీజుగా వ‌సూలు చేస్తుంది. నూత‌న మ‌ద్యం విధానం ద్వారా షాపింగ్ మాల్స్‌లో మ‌ద్యం విక్ర‌యానికి అనుమ‌తించిన ప్ర‌భుత్వం దీనిపై కొన్ని ష‌ర‌తులు విధించింది. ప‌ది వేల చ‌ద‌ర‌పు అడుగుల నిర్మాణ ప్రాంత‌మున్న షాపింగ్ మాల్స్ లోనే మ‌ద్యాన్ని విక్ర‌యించాలి. ఇటువంటి షాపింగ్ మాల్స్ ఉన్న ప్రాంతం ఆధారంగా మ‌ద్యం దుకాణాల‌కున్న లైసెన్స్ ఫీజును ప్ర‌భుత్వం వ‌సూలు చేస్తుంది.

First Published:  24 Jun 2015 6:43 PM IST
Next Story