Telugu Global
Cinema & Entertainment

అంతా పడుకుంటే నేను లేస్తా " అమీర్ ఖాన్

దేశమంతా నిద్రపోయే టైమ్ లో తను మేల్కొంటానని ప్రకటించాడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్. తన లైఫ్ స్టయిల్ కు సంబంధించి ఓ సీక్రెట్ బయటపెట్టాడు అమీర్. అర్థరాత్రి లేదా వేకువజామున జిమ్ చేయడమంటే తనకు చాలా ఇష్టమంటున్నాడు. ఉదయాన్నే రెండు గంటలకు అలారం పెట్టుకొని మరీ లేచి కసరత్తులు చేస్తానంటున్నాడు. దీనికి ఓ కారణం కూడా చెప్పుకొచ్చాడు అమీర్. ఎక్సర్ సైజులు చేసేటప్పుడు తనను ఎవరైనా డిస్టర్బ్ చేస్తే చాలా కోపం వస్తుందంటున్నాడు అమీర్. అందుకే […]

అంతా పడుకుంటే నేను లేస్తా  అమీర్ ఖాన్
X

దేశమంతా నిద్రపోయే టైమ్ లో తను మేల్కొంటానని ప్రకటించాడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్. తన లైఫ్ స్టయిల్ కు సంబంధించి ఓ సీక్రెట్ బయటపెట్టాడు అమీర్. అర్థరాత్రి లేదా వేకువజామున జిమ్ చేయడమంటే తనకు చాలా ఇష్టమంటున్నాడు. ఉదయాన్నే రెండు గంటలకు అలారం పెట్టుకొని మరీ లేచి కసరత్తులు చేస్తానంటున్నాడు. దీనికి ఓ కారణం కూడా చెప్పుకొచ్చాడు అమీర్. ఎక్సర్ సైజులు చేసేటప్పుడు తనను ఎవరైనా డిస్టర్బ్ చేస్తే చాలా కోపం వస్తుందంటున్నాడు అమీర్. అందుకే అంతా పడుకునే టైమ్ లో, సెల్ ఫోన్ కూడా స్విచాఫ్ చేసి మరీ ఎక్సర్ సైజులు చేస్తుంటానని ప్రకటించాడు. తన ప్రతి సిినిమాకు లుక్ లో వేరియేషన్ చూపించడానికి ఈ కష్టమే ప్రధాన కారణమంటున్నాడు అమీర్. కండలతో కనిపించాలన్నా, స్మార్ట్ లుక్ లో దర్శనమివ్వాలన్నా.. తాజా చిత్రం కోసం మరింత లావుగా కనిపించాలన్నా అంతా జిమ్ తోనే సాధ్యం అంటున్నాడు. కథలు, క్యారెక్టర్ల విషయంలో ఇంత సిన్సియర్ గా ఉన్నాడు కాబట్టే ప్రతి సినిమాతో సంచలనాలు సృష్టిస్తున్నాడు అమీర్.

First Published:  25 Jun 2015 1:30 AM IST
Next Story