ఏపీలో వ్యవసాయ కార్మికుల వినూత్న నిరసన
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రివర్గ సహచరులు రాజధాని కోసం జరిపిన భూ సమీకరణ విపరీత ఫలితాలను ఇవ్వడం ఆరంభమైంది. ఖరీఫ్ సీజన్ ఆరంభమైనా రాజధాని ప్రాంతంలోని పంటభూముల్లో ఎలాంటి పనులూ లేకుండా పోయాయి. దాంతో ఆ భూములపై ఆధారపడి బతుకుతున్న వ్యవసాయ కార్మికులకు పని లేకుండా పోయింది. పనులు లేక పస్తులుండలేక వ్యవసాయ కార్మికులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. వ్యవసాయ పనులు పూర్తిగా స్తంభించి పూట గడవడం కష్టమైన నేపథ్యం లో […]
BY Pragnadhar Reddy25 Jun 2015 5:33 AM IST
X
Pragnadhar Reddy Updated On: 25 Jun 2015 5:33 AM IST
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన మంత్రివర్గ సహచరులు రాజధాని కోసం జరిపిన భూ సమీకరణ విపరీత ఫలితాలను ఇవ్వడం ఆరంభమైంది. ఖరీఫ్ సీజన్ ఆరంభమైనా రాజధాని ప్రాంతంలోని పంటభూముల్లో ఎలాంటి పనులూ లేకుండా పోయాయి. దాంతో ఆ భూములపై ఆధారపడి బతుకుతున్న వ్యవసాయ కార్మికులకు పని లేకుండా పోయింది. పనులు లేక పస్తులుండలేక వ్యవసాయ కార్మికులు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. వ్యవసాయ పనులు పూర్తిగా స్తంభించి పూట గడవడం కష్టమైన నేపథ్యం లో ‘అన్నం పెట్టండి.. లేకుంటే పనైనా చూపండి’ అంటూ సిఆర్‌డిఎ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లారు. చేతిలో ఖాళీ పళ్లాలు(ప్లేట్లు) పట్టుకుని కార్యాలయంలో బైఠాయించారు. సిపిఎం రాజధాని కమిటీ ఆధ్వర్యంలో కౌలురైతులు, వ్యవసాయ కూలీలు, అసైన్డ్ భూముల రైతులు, డ్వాక్రా మహిళలు ర్యాలీగా క్రి డా కార్యాలయానికి ఖాళీ పళ్లాలతో చేరుకున్నారు. అధికారు లు స్పందించకపోవడంతో కార్యాలయంలోకి వెళ్లి అక్కడే కూ ర్చున్నారు. సమాచారమందుకున్న తుళ్లూరు ఎస్‌ఐ రవిబాబు ప్రత్యేక పోలీసులతో అక్కడికి చేరుకున్నారు. అధికారులొచ్చాక మాట్లాడొచ్చని, ఈలోగా అందరూ బయటికి రావాలని సూచించారు. అధికారులొచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేవరకూ తాము కదలబోమని అందోళనకారులు తేల్చిచెప్పారు. తాము గతంలో నాలుగుసార్లు వినతి పత్రాలిచ్చినా ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించలేదని చెప్పారు. రెండు నెలలుగా పనుల్లేక వ్యవసాయ కార్మికులు ఆకలికి అలమటించే స్థితికి చేరుకున్నారు. అయినా అధికా రులు సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారు. ప్రజా రాజధానిని నిర్మిస్తామన్న ప్రభు త్వం పేద రైతులు, వ్యవసాయ కూలీల పొట్ట లుగొట్టి వారిని రోడ్డున పడేసే కార్యక్రమానికి ఉపక్రమిస్తోందని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలను వలసలు పంపించే రాజధాని అవసరం లేదని, ప్రజలకు పనికల్పించే రాజ ధానే కావాలని స్పష్టం చేశారు. అనంతరం అక్కడికొచ్చిన డిప్యూటీ కలెక్టర్ రెహంతుల్లా ఆందోళనకారుల నుండి వినతిపత్రాన్ని తీసుకున్నారు.
Next Story